OTT Malayalam: ప్రస్తుత రోజుల్లో భాషతో అస్సలు సంబంధం లేకుండా కేవలం కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మధ్య కాలంలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం ఓటీటీ వేదికలపై సరికొత్త మలయాళ చిత్రాలు, సిరీస్ సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. హారర్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వంటి విభిన్న జానర్లలో ఈ వారం డిజిటల్ స్క్రీన్‌పై అలరించనున్న ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
1. పవిత్రం సీజన్ 2 (Pavithram Season 2)

నటీనటులు: సురభి సంతోష్, శ్రీకాంత్ శశికుమార్
దర్శకుడు: సునీల్ కరియాట్టుకర
జానర్: రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్
ఎక్కడ చూడవచ్చు: జియోహాట్‌స్టార్ (JioHotstar)
సాంప్రదాయ విలువలను అమితంగా గౌరవించే వేద అనే యువతి జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊహించని కొన్ని క్లిష్ట పరిస్థితుల వల్ల విక్రమ్ అనే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కానీ అతను జైలుకు వెళ్తాడు. ఈ ఊహించని వివాహం వారి జీవితాలను ఏ మలుపు తిప్పింది, వారి మధ్య బంధం ఎలా బలపడింది అనే ఆసక్తికర అంశాలను ఈ సిరీస్‌లో ఆవిష్కరించారు.
సీరియల్ టు సిరీస్
మారిన పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోతూనే, తన ఆత్మగౌరవాన్ని, సిద్ధాంతాలను కాపాడుకోవడానికి వేద ఎలాంటి పోరాటం చేసిందనేది ఈ సిరీస్ లో చూడవచ్చు. మొదట టెలివిజన్ సీరియల్‌గా ప్రసారమై భారీ టిఆర్‌పి రేటింగ్‌లతో దూసుకుపోయిన ఈ షో, ఇప్పుడు రెండో సీజన్‌తో నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది. జూలై 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
2. చితిని (Chithini)
నటీనటులు: అమిత్ చాలకల్, వినయ్ ఫోర్ట్, మోక్ష, జోని ఆంటోని, సుధీష్, ఆరతి నాయర్
{{/usCountry}}నటీనటులు: అమిత్ చాలకల్, వినయ్ ఫోర్ట్, మోక్ష, జోని ఆంటోని, సుధీష్, ఆరతి నాయర్
{{/usCountry}}దర్శకుడు: ఈస్ట్ కోస్ట్ విజయన్
జానర్: హారర్ థ్రిల్లర్ డ్రామా
ఎక్కడ చూడవచ్చు: మనోరమ మ్యాక్స్ (ManoramaMAX)
హారర్ సినిమాలను ఇష్టపడే వారిని భయపెట్టడానికి వస్తున్న సరికొత్త చిత్రం 'చితిని'. గర్భవతి అయిన ఒక మహిళ దారుణ హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన ఆ మహిళ ఆత్మ ప్రశాంతత కరువై, పురాణాల్లోని భయంకరమైన 'చితిని' రూపంలో భూమిపైకి తిరిగి వస్తుంది.
తనకు అన్యాయం చేసిన వారిని వెతికి పట్టుకుని, తన చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకునే క్రమంలో సాగే ఉత్కంఠభరితమైన కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2024న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఈ వారమే ఓటీటీలోకి రానుందని సమాచారం.
3. రివాల్వర్ రింకో (Revolver Rinko)
నటీనటులు: విష్ణు ఉన్నికృష్ణన్, లాలు అలెక్స్, బిను శశిరామ్, విజిలేష్ కరాయద్
దర్శకుడు: కిరణ్ నారాయణన్
జానర్: అడ్వెంచర్ కామెడీ డ్రామా
ఎక్కడ చూడవచ్చు: సైనా ప్లే (Saina Play)
గ్రామీణ నేపథ్యంలో సాగే పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిది. కోజికోడ్ సమీపంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన కొందరు యువకులు సొంతంగా, తక్కువ బడ్జెట్‌లో ఒక అద్భుతమైన సూపర్ హీరో సినిమా తీయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు.
తమ సృజనాత్మక ఆలోచనలకు రూపం ఇచ్చి వెండితెరపై ఆవిష్కరించే క్రమంలో ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ లో వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించారు. ఇప్పటికే ఇది సన్ నెక్ట్స్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.