...
...
Next Story

ఓటీటీలోకి మరో సూపర్ హిట్ మలయాళం రొమాంటిక్ డ్రామా.. ఐఎండీబీలో 8 రేటింగ్

మలయాళంలో క్రిస్మస్ కానుకగా విడుదలై మంచి పేరు తెచ్చుకున్న 'మిండియుమ్ పరంజుమ్' సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఉన్ని ముకుందన్, జాతీయ అవార్డు గ్రహీత అపర్ణ బాలమురళి జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఫిబ్రవరి 6 నుంచి సన్ ఎన్‌ఎక్స్‌టీ (Sun NXT)లో స్ట్రీమింగ్ కానుంది.

Published on: Feb 2, 2026, 21:01:47 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మలయాళం రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఓ ఫీల్ గుడ్ సినిమాగా గతేడాది క్రిస్మస్ కు రిలీజైన ఈ మూవీ.. మొత్తానికి సుమారు 40 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ మలయాళ మూవీ పేరు 'మిండియుమ్ పరంజుమ్' (Mindiyum Paranjum). ఉన్ని ముకుందన్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓటీటీ విడుదల వివరాలు అధికారికంగా బయటికి వచ్చాయి.

మిండియుమ్ పరంజుమ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?

ఓటీటీలోకి మరో సూపర్ హిట్ మలయాళం రొమాంటిక్ డ్రామా.. ఐఎండీబీలో 8 రేటింగ్
ఓటీటీలోకి మరో సూపర్ హిట్ మలయాళం రొమాంటిక్ డ్రామా.. ఐఎండీబీలో 8 రేటింగ్

థియేటర్లలో విడుదలైన సుమారు 40 రోజుల తర్వాత ఈ మిండియుమ్ పరంజుమ్ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్ట్స్' (Sun NXT) వేదికగా ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి మొదటి వారంలో మలయాళం నుంచి పెద్దగా ఇతర ఓటీటీ రిలీజ్‌లు లేకపోవడంతో.. ఈ వీకెండ్‌లో ఇంటిల్లిపాదీ చూడదగ్గ సినిమాగా ఇది నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐఎండీబీలో దీనికి ఏకంగా 8 రేటింగ్ ఉంది.

మరోవైపు క్రిస్మస్ కానుకగా వచ్చిన నివిన్ పాలీ హారర్ కామెడీ మూవీ 'సర్వం మాయ' కూడా జియోహాట్‌స్టార్ వేదికగా గతవారం స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి థియేటర్లలో కంటే ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

మిండియుమ్ పరంజుమ్ కథేంటి?

కేరళలోని ఇడుక్కి అందాల నేపథ్యంలో సాగే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది. కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన సనల్ (ఉన్ని ముకుందన్), తన ప్రేయసి లీనా (అపర్ణ బాలమురళి) కోసం ఇడుక్కి చేరుకుంటాడు. వారిద్దరి జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించి వారు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అనేదే ఈ సినిమా మూల కథ. ఇందులో భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

మిండియుమ్ పరంజుమ్ విశేషాలు

నిజానికి ఈ సినిమా షూటింగ్ రెండో లాక్‌డౌన్ సమయంలోనే జరిగింది. పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రతి మలయాళీ కుటుంబంలోనూ ఎవరో ఒకరు విదేశాల్లో ఉంటారని, వారి జీవితాలకు ఈ కథ దగ్గరగా ఉంటుందని దర్శకుడు అరుణ్ బోస్ పేర్కొన్నాడు. ఆలస్యంగా వచ్చినా థియేటర్లలో ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయి ఆదరణ దక్కుతుందని చిత్రబృందం భావిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe