OTT: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన మలయాళం యాక్షన్ థ్రిల్లర్.. పవర్‌ఫుల్ డాన్‌గా మోహన్‌లాల్.. స్ట్రీమింగ్ ఇక్కడే
మలయాళ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులో ఓటీటీలోకి వచ్చేసింది. దిగ్గజ నటుడు మోహన్ లాల్ పవర్ ఫుల్ డాన్ గా నటించిన ఈ మూవీ తెలుగు ఆడియన్స్ నూ ఎంటర్ టైన్ చేస్తోంది.
మలయాళ సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లోనూ క్రేజ్ ఉంటుంది. మన ఆడియన్స్ కేరళ చిత్రాలను ఆదరిస్తూనే ఉంటారు. అందుకే ఓటీటీలో మలయాళం సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు మోహన్ లాల్, దిలీప్ కీలక పాత్రలు పోషించిన ‘భా భా బా’ సినిమా కూడా ఓటీటీలో తెలుగులోకి వచ్చేసింది.

భా భా బా ఓటీటీ
సినిమా పేరు వింటేనే వెరైటీగా ఉంది కదూ. ఇదో మలయాళ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసే కామనర్ స్టోరీ ఆధారంగా భా భా బా మూవీ తెరకెక్కింది. ఈ సినిమా జీ5 ఓటీటీలో ఉంది. అయితే జనవరి 16నే మలయాళంలో రిలీజైంది. ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది.
సూపర్ హిట్
మలయాళ సినిమా భా భా బా మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. దీని బడ్జెట్ రూ.30 కోట్లు. దీనికి ప్రపంచవ్యాప్తంగా రూ.46.06 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే భా భా బా మూవీ సూపర్ హిట్ అని చెప్పొచ్చు. దీనికి ధనుష్ జేమ్స్ వర్గీస్ డైరెక్టర్. 2025 డిసెంబర్ 18న థియేటర్లలో రిలీజైంది ఈ భా భా బా మూవీ.
టైటిల్ అర్థం ఇదే
భా భా బా మూవీ పేరుతోనే ఆడియన్స్ ను తెగ అట్రాక్ట్ చేసింది. అయితే ఈ భా భా బా అంటే ఏంటీ? అని నెటిజన్లు తెగ వెతికేశారు. మలయాళంలో భా భా బా అంటే భయం, భక్తి, బహుమానం అని అర్థం. ఈ భా భా బా సినిమాలో మోహన్ లాల్, దిలీప్ తో పాటు వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాస్, శరణ్య, బైజు సంతోష్ తదితరులు నటించారు.
భా భా బా స్టోరీ
కేరళ ముఖ్యమంత్రిగా సి.కె.జోసెఫ్ (బైజు సంతోష్) ఎన్నికవుతాడు. అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే రాడార్ (దిలీప్) అనే ఒక కామనర్ ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడం కలకలం రేపుతుంది. సీఎంను కిడ్నాప్ చేసిన రాడార్.. ప్రజల సమస్యలను డైరెక్ట్ గా సీఎంగా చెప్పాలనుకుంటాడు.
మరోవైపు సీఎం జోసెఫ్ కుమారుడు నోబుల్ జోసెఫ్ (వినీత్ శ్రీనివాసన్) ఎన్ఐఏ ఆఫీసర్. తండ్రిని రక్షించడానికి అతనే స్వయంగా రంగంలోకి దిగుతాడు. మరి రాడార్ ను అతను కనిపెట్టాడా? పవర్ ఫుల్ డాన్ గిల్లి బాలగా మోహన్ లాల్ ఆకట్టుకున్నాడా? అన్నది భా భా బా సినిమాలో చూడాల్సిందే. ఇప్పుడు తెలుగులో ఇది జీ5 ఓటీటీలో ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


