...
...
Next Story

OTT Malayalam: ఓటీటీలో మలయాళం థ్రిల్లర్లే కాదు.. ఇలాంటి లవ్ స్టోరీలకూ ఫుల్ క్రేజ్.. 330 కోట్ల రొమాంటిక్ మూవీ ట్రెండింగ్

OTT Malayalam: భారీ అంచనాలు, వందల కోట్ల ప్రమోషన్లు లేకుండా కేవలం కంటెంట్ నమ్ముకుని బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిన మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’. రూ.330 కోట్ల వసూళ్ల ఈ సినిమా ప్రస్తుతం జియోహాట్‌స్టార్ లోనూ టాప్ ట్రెండింగ్ లో ఉంది.

Published on: Oct 29, 2026, 16:08:22 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Malayalam: ఓటీటీ.. అందులోనూ మలయాళం సినిమా అంటే థ్రిల్లర్లే అనుకుంటారు. కానీ ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మంచి రొమాంటిక్ డ్రామా బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ అనే మూవీ కూడా జియోహాట్‌స్టార్ ఓటీటీని దున్నేస్తోంది. ఈ ఓటీటీలో తెలుగులోనూ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. బలమైన కథాంశం, ఆకట్టుకునే హాస్యం, సహజ సిద్ధమైన నటన ఉంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ మూవీ నిరూపిస్తోంది.

OTT Malayalam: ఓటీటీలో థ్రిల్లర్లే కాదు.. ఇలాంటి లవ్ స్టోరీలకూ ఫుల్ క్రేజ్.. 330 కోట్ల మలయాళం రొమాంటిక్ మూవీ ట్రెండింగ్
OTT Malayalam: ఓటీటీలో థ్రిల్లర్లే కాదు.. ఇలాంటి లవ్ స్టోరీలకూ ఫుల్ క్రేజ్.. 330 కోట్ల మలయాళం రొమాంటిక్ మూవీ ట్రెండింగ్

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని.. మలయాళం ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్ల మూవీగా నిలిచింది. ప్రస్తుతం డిజిటల్ ఆడియెన్స్ ను ఊపేయడానికి జియోహాట్‌స్టార్ లో మలయాళం సహా ఐదు భాషల్లో అందుబాటులో ఉంది.

బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ అసలు కథేంటి? కనెక్ట్ అయ్యే ఎమోషన్స్

'ప్రేమలు' (Premalu) వంటి యూత్‌ఫుల్ సన్సేషన్‌ను అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు గిరీష్ ఏ. డి. (Girish A.D.) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ భావనా స్టూడియోస్ అత్యున్నత నిర్మాణ విలువలతో దీనిని నిర్మించింది.

ఈ సినిమా కథాంశం కుటుంబ బంధాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, నేటితరం ప్రేమ సంబంధాల చుట్టూ తిరుగుతుంది. ఓ మధ్య వయస్కుడైన అబ్బాయిని ఇష్టపడే ఓ జెన్ జీ అమ్మాయి చుట్టూ తిరిగే కథే ఈ మూవీ. ఇద్దరి మధ్యా వయసు తేడా చాలా ఉండటంతో చాన్నాళ్ల పాటు సీక్రెట్ గా తమ ప్రేమాయణం నడిపే ఈ జంట.. తర్వాత తమ కుటుంబాలు, సమాజం నుంచి ఎలాంటి వ్యతిరేకత మూటగట్టుకుందో ఈ మూవీ కళ్లకు కట్టింది.

నివిన్ పౌలీ, మమితా బైజుల కెమిస్ట్రీ

నివిన్ పౌలీ తనదైన మార్కు టైమింగ్ హాస్యంతో అలరించగా, మమితా బైజు తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. వీరిద్దరి మధ్య సాగే స్క్రీన్ కెమిస్ట్రీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

వీరితో పాటు సంగీత్ ప్రతాప్, వినయ్ ఫోర్ట్, సురేష్ కృష్ణ ఇతర ముఖ్య పాత్రలలో నటించి మెప్పించారు. విష్ణు విజయ్ అందించిన వీనులవిందైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఫీల్-గుడ్ డ్రామాకు అదనపు బలాన్ని చేకూర్చాయి.

ఐఎండీబీలో 8 రేటింగ్..

ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్, వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 330.93 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు ప్రముఖ సినీ రేటింగ్ సంస్థ IMDbలో ఏకంగా 8/10 రేటింగ్‌ను సాధించింది. మంచి కథలకు బడ్జెట్‌తో సంబంధం లేదని ఈ సినిమా మరోసారి నిరూపించింది.

ఒకవేళ మీరు ఈ బ్లాక్‌బస్టర్ రోమ్-కామ్‌ను థియేటర్లలో మిస్ అయి ఉంటే, ఇప్పుడు హ్యాపీగా ఇంట్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా చూడొచ్చు. 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్ లో మంచి ఎంటర్‌టైనింగ్ ఫ్యామిలీ సినిమా చూడాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks