Malayalam: సంజూ శాంసన్ సూపర్ ఫ్యాన్‌గా మారిపోయిన మలయాళం స్టార్ హీరో.. అతని జెర్సీతో స్టేడియంలో హడావిడి

మలయాళం స్టార్ హీరో బేసిల్ జోసెఫ్.. సంజూ శాంసన్ వీరాభిమానిగా మారిపోయాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో స్టేడియంలో అతడు సంజూ జెర్సీ వేసుకొని కనిపించాడు. రోడ్డుపై అతడు చేసిన హడావిడి మామూలుగా లేదు.

Published on: Mar 9, 2026, 12:32:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వెలుపల ఒక ఆసక్తికర సీన్ కనిపించింది. ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు బేసిల్ జోసెఫ్ (పొన్‌మ్యాన్ ఫేమ్) ఒక సామాన్య క్రికెట్ అభిమానిలా మారిపోయి సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Malayalam: సంజూ శాంసన్ సూపర్ ఫ్యాన్‌గా మారిపోయిన మలయాళం స్టార్ హీరో.. అతని జెర్సీతో స్టేడియంలో హడావిడి
Malayalam: సంజూ శాంసన్ సూపర్ ఫ్యాన్‌గా మారిపోయిన మలయాళం స్టార్ హీరో.. అతని జెర్సీతో స్టేడియంలో హడావిడి

రోడ్డు పక్కన సంజూ శాంసన్ జెర్సీ కొని..

స్టేడియం బయట పండుగ వాతావరణం నెలకొన్న వేళ.. మలయాళం స్టార్ బేసిల్ జోసెఫ్ రోడ్డు పక్కన ఉన్న ఒక స్టాల్‌ దగ్గర ఆగాడు. తన అత్యంత సన్నిహితుడు, భారత క్రికెటర్ సంజూ శాంసన్ పేరు ముద్రించి ఉన్న టీ-షర్ట్‌ను కొనుగోలు చేశాడు. ఆ జెర్సీని గర్వంగా కెమెరాకు చూపిస్తూ అతడు చిరునవ్వులు చిందించాడు. చుట్టూ ఉన్న యువత అతన్ని గుర్తుపట్టి సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.

అంతేకాకుండా స్టేడియం లోపలికి వెళ్లే ముందు బేసిల్ తన బుగ్గలపై భారత త్రివర్ణ పతాకాన్ని పెయింట్ చేయించుకున్నాడు. మ్యాచ్ ప్రారంభమయ్యాక, తను కొన్న శాంసన్ జెర్సీని ధరించి టీమ్ ఇండియాను ఉత్సాహపరుస్తున్న ఫోటోలను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

స్టేడియంలో మెరిసిన ప్రముఖులు

ఈ చారిత్రాత్మక ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు నరేంద్ర మోదీ స్టేడియానికి దిగ్గజాలు తరలివచ్చారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, లెజెండరీ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ స్టాండ్స్‌లో కనిపించి అభిమానులను అలరించారు. బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా కూడా గ్యాలరీలో సందడి చేస్తూ కనిపించింది.

మ్యాచ్ హైలైట్స్: భారత్ విశ్వవిజేత

న్యూజిలాండ్‌తో జరిగిన ఈ ఫైనల్‌లో భారత్ 96 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.

బేసిల్ జోసెఫ్ ఎవరి కోసమైతే జెర్సీ కొన్నాడో, అదే సంజూ శాంసన్ 46 బంతుల్లో 89 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 159 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా (4/15) తన అద్భుత బౌలింగ్‌తో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును దక్కించుకోగా, అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశారు. భారత్ సాధించిన ఈ అద్భుత విజయం దేశవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని నింపింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More