...
...
Next Story

Mamitha Baiju: హాస్పిటల్ పాలైన హీరోయిన్.. వరుసగా మూడు బ్లాక్‌బస్టర్ హిట్స్.. ఇప్పుడు హై ఫీవర్‌

Mamitha Baiju Hospitalised: మమితా బైజు హాస్పిటల్లో చేరారు. వరుసగా మూడు రూ.200 కోట్ల సినిమాలతో హ్యాట్రిక్ సాధించిన ఈ స్టార్ హీరోయిన్.. ప్రస్తుతం హై ఫీవర్, ఆస్తమాలాంటి సమస్యలతో చికిత్స పొందుతున్నారు.

Published on: Sep 2, 2026, 15:59:16 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Mamitha Baiju Hospitalised: 'ప్రేమలు' సినిమాతో సౌత్ ఇండియా వ్యాప్తంగా యూత్ క్రష్‌గా మారిన మలయాళీ భామ మమిత బైజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హఠాత్తుగా తీవ్రమైన జ్వరం, ఎలర్జీ, ఆస్తమా సమస్యలు ఎక్కువ కావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు ఆమెను ప్రయాణాలు చేయకుండా పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు.

ఆస్ట్రేలియా టూర్ హఠాత్తుగా రద్దు

Mamitha Baiju: హాస్పిటల్ పాలైన హీరోయిన్.. వరుసగా మూడు బ్లాక్‌బస్టర్ హిట్స్.. ఇప్పుడు హై ఫీవర్‌
Mamitha Baiju: హాస్పిటల్ పాలైన హీరోయిన్.. వరుసగా మూడు బ్లాక్‌బస్టర్ హిట్స్.. ఇప్పుడు హై ఫీవర్‌

ఆస్ట్రేలియాలోని క్లైడ్ మలయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఓనమ్ వేడుకలకు మమితా బైజు చీఫ్ గెస్ట్‌గా హాజరుకావాల్సి ఉంది. ఆస్ట్రేలియాలోని ప్రవాస మలయాళీలను కలవడానికి ఆమె ఎంతో ఉత్సాహంగా ప్లాన్ చేసుకున్నారు.

కానీ ప్రయాణం చేసే పరిస్థితి లేకపోవడంతో ఆస్ట్రేలియా ఈవెంట్ నిర్వాహకులకు మమితా బైజు క్షమాపణలు చెబుతూ ఒక ప్రత్యేక సందేశం పంపారు. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, శ్వాసకోశ ఇబ్బందుల వల్ల విమాన ప్రయాణం చేయడం అస్సలు సాధ్యం కావడం లేదని స్పష్టం చేశారు. అభిమానులను నిరాశపరిచినందుకు తీవ్రంగా విచారిస్తున్నట్లు వెల్లడించారు.

బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ రికార్డుల హోరు

ప్రస్తుతం మమితా బైజు కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. రీసెంట్‌గా నివిన్ పౌలీ సరసన ఆమె నటించిన 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' (Bethlehem Kudumba Unit) మూవీ ఓనమ్ రేసులో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది.

గిరీష్ ఎ.డి. దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 215.20 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 2026లోనే ఆమెకు ఇది వరుసగా మూడో రూ. 200 కోట్ల బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ కావడం విశేషం.

2024లో వచ్చిన రొమాంటిక్ హిట్ 'ప్రేమలు' (Premalu)లో 'రీను' పాత్రతో మమిత సాధించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆ సినిమా దాదాపు రూ. 136 కోట్ల గ్రాస్ వసూలు చేసి సౌత్ మొత్తాన్ని ఊపేసింది.

ఆ తర్వాత తమిళంలో 'డ్యూడ్' (Dude) సినిమాతో రూ. 100 కోట్ల మార్కును అందుకుని కోలీవుడ్‌లో విజయం సాధించారు. కేవలం 50 రోజుల వ్యవధిలోనే మూడు సినిమాలు రూ. 200 కోట్ల గ్రాస్ సాధించడం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయి.

ఇంతటి వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న మమిత హఠాత్తుగా ఆస్పత్రి పాలవ్వడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లలో పాల్గొనాలని సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe