...
...
Next Story

Baby Girl Review: బేబీ గర్ల్.. ఈ డిఫరెంట్ మలయాళం థ్రిల్లర్ మూవీ చూశారాా? ఒక్క రోజులో జరిగే కథ ఎలా ఉందంటే?

మలయాళం థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తుందంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కడ లేని ఆసక్తి నెలకొంటుంది. ఇప్పుడు బేబీ గర్ల్ అనే సినిమా కూడా సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతోపాటు హిందీ ఆడియోతో అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూడండి.

Published on: Feb 13, 2026, 19:38:05 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

థ్రిల్లర్ సినిమాలు తీయడంలో మలయాళం ఫిల్మ్ మేకర్స్ కు ఓ స్పెషాలిటీ ఉంది. ఓ చిన్న పాయింట్ తీసుకొని దానికి అద్భుతమైన స్క్రీన్ ప్లే జోడించి మెప్పిస్తారు. అయితే తాజాగా సోనీ లివ్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చిన నివిన్ పాలీ మూవీ బేబీ గర్ల్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మూడు రోజుల పాప మిస్సింగ్ కేసు చుట్టూ తిరిగే ఈ సినిమా.. మంచి నటీనటులున్నా బలహీనమైన రైటింగ్ కారణంగా నిరాశపరిచింది.

బేబీ గర్ల్ మూవీ స్టోరీ ఏంటంటే?

Baby Girl Review: బేబీ గర్ల్.. ఈ డిఫరెంట్ మలయాళం థ్రిల్లర్ మూవీ చూశారాా? ఒక్క రోజులో జరిగే కథ ఎలా ఉందంటే?
Baby Girl Review: బేబీ గర్ల్.. ఈ డిఫరెంట్ మలయాళం థ్రిల్లర్ మూవీ చూశారాా? ఒక్క రోజులో జరిగే కథ ఎలా ఉందంటే?

మలయాళ స్టార్ నివిన్ పాలీ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ 'బేబీ గర్ల్' (Baby Girl). జనవరి 23న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా గురువారం (ఫిబ్రవరి 12) నుంచి సోనీ లివ్ ఓటీటీలో మలయాళం, హిందీ ఆడియోలతో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ ఆసుపత్రి నుంచి మూడు రోజుల వయసున్న పసికందు మాయమవడం చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూడండి.

'బేబీ గర్ల్' సినిమా కథ విషయానికి వస్తే.. సనల్ మాథ్యూ (నివిన్ పాలీ) ఒక ఆసుపత్రిలో అటెండెంట్ గా పనిచేస్తుంటాడు. అంతా సజావుగా సాగుతుండగా మెటర్నిటీ వార్డు నుంచి కేవలం మూడు రోజుల వయసున్న ఒక పసికందు అకస్మాత్తుగా మాయమవుతుంది. సరిగ్గా అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నగరానికి రావడంతో పోలీసులంతా భద్రతా ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. దీంతో తగినంత మంది పోలీసు సిబ్బంది లేకుండానే పోలీసులో విచారణ మొదలుపెడతారు.

హింట్ ఇచ్చిన వ్యక్తే అనుమానితుడిగా..

మొదట సనల్ చెప్పిన వివరాల ఆధారంగా బురఖా ధరించిన ఒక మహిళపై పోలీసులకు అనుమానం కలుగుతుంది. ఆమెనే ప్రధాన నిందితురాలిగా భావిస్తారు. కానీ విచారణ సాగే కొద్దీ కథ ఊహించని మలుపు తిరుగుతుంది. అసలు ఫిర్యాదు చేసిన సనల్ మీదే పోలీసులకు అనుమానం కలుగుతుంది.

ఈ బేబీ గర్ల్ సినిమాకు ప్రధాన బలం నటీనటులే. నివిన్ పాలీ తన పాత్రకు తగ్గట్టుగా నటించాడు. అయితే అతని కంటే లిజోమోల్ జోస్, సంగీత్ ప్రతాప్ తమ నటనతో ఆకట్టుకున్నారు. సాధారణంగా మలయాళం థ్రిల్లర్స్ అంటే ఊహించని ట్విస్టులతో సాగిపోతుంది. కానీ బేబీ గర్ల్ మాత్రం అలా లేదు. చాలా వరకు కథ ముందుగానే ఊహించేలా ఉంటుంది. క్లైమ్యాక్స్ దగ్గర పడుతున్న కొద్దీ కొన్ని మలుపులు ఉన్నా.. అప్పటికే మూవీపై ఉన్న ఆసక్తి సన్నగిల్లుతుంది.

ఈ సినిమా మొత్తం ఒక రోజులో ముగిసే కథగా చూపించారు. ఆ రకంగా 'బేబీ గర్ల్' పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దాన్ని తెరపై చూపించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం బలహీనమైన రైటింగ్. ఒక మంచి థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన డెప్త్ ఈ మూవీ స్క్రీన్ ప్లేలో స్పష్టంగా లోపించింది. బాబీ, సంజయ్ లాంటి ప్రముఖ రైటర్స్ అందించిన ఈ స్క్రిప్ట్ మాత్రం అంత బలంగా అనిపించలేదు.

బేబీ గర్ల్ మూవీ డైరెక్టర్ అరుణ్ వర్మ కూడా ఈ లోపాలను సరిదిద్దలేకపోయాడు. దీంతో సినిమా మొత్తం చాలా ఫ్లాట్ గా సాగుతుంది. సినిమా నిడివి తక్కువే అయినా స్క్రీన్ ప్లే సాగదీసినట్లుగా అనిపించడం పెద్ద మైనస్ అని చెప్పాలి. ఈ మధ్యే సర్వం మాయతో బ్లాక్‌బస్టర్ అందుకున్న నివిన్ పాలీ.. ఈ బేబీ గర్ల్ తో నిరాశపరిచాడు. నిజానికి తన స్థాయికి తగిన పాత్ర కూడా కాదు ఇది. మొత్తంగా 2 గంటల్లో ముగిసే ఓ మలయాళ థ్రిల్లర్ ఈ వీకెండ్ చూడాలనుకుంటే ఈ బేబీ గర్ల్ చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe