Malayalam Thriller: ఓటీటీలోకి వస్తున్న మరో మలయాళం థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8 రేటింగ్..

ఓటీటీలోకి మరో మలయాళం థ్రిల్లర్ (Malayalam Thriller) మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమా పేరు ధీరమ్ (Dheeram). ఇంద్రజీత్ సుకుమారన్ నటించిన ఈ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Feb 27, 2026, 15:57:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘ధీరమ్’ (Dheeram). ఈ సినిమా డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. వచ్చే వారమే అంటే మార్చి 6 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్స్ట్' (Sun NXT)లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 8 రేటింగ్ నమోదైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేదు.

Malayalam Thriller: ఓటీటీలోకి వస్తున్న మరో మలయాళం థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8 రేటింగ్..
Malayalam Thriller: ఓటీటీలోకి వస్తున్న మరో మలయాళం థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8 రేటింగ్..

పోలీస్ ఆఫీసర్‌గా ఇంద్రజిత్ వేట

మలయాళ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఇంద్రజిత్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధీరమ్’ ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తోంది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ.. సుమారు మూడు నెలల తర్వాత డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతోంది. జితిన్ సురేష్ టి దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మార్చి 6 నుంచి 'సన్ నెక్స్ట్'లో అందుబాటులోకి రానుంది.

చాలా కాలం తర్వాత ఇంద్రజిత్ సుకుమారన్ ఈ సినిమాలో పోలీస్ యూనిఫామ్ ధరించాడు. కేరళలోని కోళికోడ్ నగరంలో వరుసగా జరుగుతున్న హత్యల వెనుక ఉన్న సైకో కిల్లర్‌ను పట్టుకునే ఏసీపీ స్టాలిన్ జోసెఫ్ పాత్రలో అతడు నటించాడు. ఒక పక్కా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో అజు వర్గీస్, దివ్య పిళ్లై, విజయరాఘవన్, సాగర్ సూర్య, రెబా మోనికా జాన్ కీలక పాత్రలు పోషించారు.

థియేటర్లో మిశ్రమ స్పందన.. ఓటీటీలో హిట్టయ్యేనా?

గతేడాది డిసెంబర్‌లో మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘కలంకావల్’తో పాటు ‘ధీరమ్’ కూడా విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ‘కలంకావల్’ ఘనవిజయం సాధించగా, ‘ధీరమ్’ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ద్వారా మంచి ఆదరణ పొందుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు. తొలుత ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. చివరికి సన్ నెక్స్ట్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మలయాళ భాషలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాకు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More