ఓటీటీలోకి సుమారు ఏడాది తర్వాత ఓ మలయాళం థ్రిల్లర్ మూవీ అడుగుపెట్టింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ ఏడాది నటించిన తొలి సినిమా ఇది. మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ అయింది. ఈ మూవీ పేరు డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్. ఈ సినిమా స్ట్రీమింగ్ విశేషాలేంటో చూడండి.
డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ ఓటీటీ స్ట్రీమింగ్

మమ్ముట్టి నటించిన డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ శుక్రవారం (డిసెంబర్ 19) నుంచి జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఒరిజినల్ మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. నిజానికి ఈ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని ఆ ఓటీటీ ముందుగా వెల్లడించలేదు. సడెన్ గా తెలుగులోనూ తీసుకొచ్చి ఆశ్చర్యపరిచింది.
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మూవీ గురించి..
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా 11 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఇది 2025 జనవరి 23న థియేటర్లలో రిలీజైంది. ఇందులో మమ్ముట్టి, గోకుల్ సురేష్, సుష్మిత భట్ తదితరులు నటించారు. దీనికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్టర్. ఈ సినిమాను మమ్ముట్టి కంపెనీ బ్యానర్ పై స్వయంగా మమ్ముట్టి నిర్మించాడు. డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మూవీకి క్రిటిక్స్ నుంచి మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి.
దొరికిన ఒక లేడీ పర్స్ ఆధారంగా మిస్సింగ్ కేసును ఎలా దర్యాప్తు చేశారనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కింది డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా. ఇందులో మమ్ముట్టి మాజీ పోలీస్ ఆఫీసర్ డొమినిక్ గా నటించాడు. గోకుల్ సురేష్ ఏమో డొమినిక్ అసిస్టెంట్ విక్కీగా యాక్ట్ చేశాడు. మాజీ పోలీస్ అధికారి అయిన డొమినిక్ ఓ ప్రైవేట్ డిటెక్టివ్ గా మారతాడు.
దొరికిన లేడీస్ పర్స్ ఓనర్ ఎవరు అని కనిపెట్టేందుకు డొమినిక్, విక్కీ రంగంలోకి దిగుతారు. ఆ క్రమంలోనే అప్పటికే మిస్సయిన పూజ అనే అమ్మాయితో ఈ పర్స్ కు కనెక్షన్ ఉందని కనిపెడతారు. ఇంకా ఎంక్వైరీ చేస్తుంటే పూజ బాయ్ ఫ్రెండ్ కార్తీక్ కూడా కనిపించడం లేదని తెలుస్తుంది. చివరకు పూజ హత్య విషయం బయటపడుతుంది. ఇక్కడ వచ్చే ఓ ట్విస్ట్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది.
{{/usCountry}}దొరికిన లేడీస్ పర్స్ ఓనర్ ఎవరు అని కనిపెట్టేందుకు డొమినిక్, విక్కీ రంగంలోకి దిగుతారు. ఆ క్రమంలోనే అప్పటికే మిస్సయిన పూజ అనే అమ్మాయితో ఈ పర్స్ కు కనెక్షన్ ఉందని కనిపెడతారు. ఇంకా ఎంక్వైరీ చేస్తుంటే పూజ బాయ్ ఫ్రెండ్ కార్తీక్ కూడా కనిపించడం లేదని తెలుస్తుంది. చివరకు పూజ హత్య విషయం బయటపడుతుంది. ఇక్కడ వచ్చే ఓ ట్విస్ట్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది.
{{/usCountry}}మరి పూజను హత్య చేసింది ఎవరు? కార్తీక్ ఏమయ్యాడు? ఆ ట్విస్ట్ ఏంటీ? అన్నది డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.