OTT Malayalam Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన దృశ్యం డైరెక్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. అమ్మాయి హత్య మిస్టరీ
OTT Malayalam Thriller: ఓటీటీలోకి దృశ్యం డైరెక్టర్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ వలతు వశతే కల్లన్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది. గతంలో కేవలం మలయాళం, తమిళ భాషల్లో ఉండగా.. తాజాగా తెలుగు, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రావడం విశేషం.
OTT Malayalam Thriller: 'దృశ్యం' ఫేమ్ జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'వలతు వశతే కల్లన్' (Valathu Vashathe Kallan). ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. ఇన్నాళ్లూ కేవలం మలయాళం ఆడియోతోనే స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ వచ్చింది. ఓ అమ్మాయి హత్య మిస్టరీ చుట్టూ తిరిగే మూవీ ఇది.

లయన్స్‌గేట్ ప్లేలో తెలుగు వెర్షన్
మలయాళం థ్రిల్లర్ మూవీ అయిన ఈ వలతు వశతే కల్లన్ సినిమా గతంలోనే మనోరమ మ్యాక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే కేవలం మలయాళం, తమిళంలలోనే అందుబాటులో ఉంది. కానీ తాజాగా లయన్స్‌గేట్ ప్లే ఓటీటీ వీటితోపాటు తెలుగు, హిందీ వెర్షన్లు కూడా జోడించింది. ప్రైమ్ వీడియో నుంచి లేదంటే నేరుగా లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలోకి వెళ్లి ఈ మూవీ తెలుగులో ఎంజాయ్ చేయొచ్చు.
జీతూ జోసెఫ్ టచ్.. థ్రిల్లింగ్ కథ
‘దృశ్యం’ సిరీస్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు దర్శకుడు జీతూ జోసెఫ్. తాజాగా బిజు మీనన్, జోజు జార్జ్ ప్రధాన పాత్రల్లో అతడు తెరకెక్కించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘వలతు వశతే కల్లన్’. అయితే ఈ సినిమా అనుకున్నస్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.
సినిమా కథ చాలా పవర్‌ఫుల్‌గా మొదలవుతుంది. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆంటోనీ జేవియర్ (బిజు మీనన్) ఒక స్వార్థపరుడైన పోలీస్ అధికారి. లైంగిక వేధింపులకు గురైన బాధితురాలిని ఫిర్యాదు చేయకుండా అడ్డుకునే స్థాయి క్రూరత్వం అతనిది. ఇలాంటి వ్యక్తికి ఒక యువతి (వైష్ణవి రాజ్) అదృశ్యం కేసు ఎదురవుతుంది. ఈ క్రమంలో అతనికి శామ్యూల్ (జోజు జార్జ్) అనే ఎథికల్ హ్యాకర్ పరిచయమవుతాడు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకోవాలనే వీరిద్దరి ప్రయాణం, ఆ అదృశ్యమైన అమ్మాయిని వెతికే క్రమంలో ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ.
మూవీ స్టోరీ, దీనికోసం వాడిన పజిల్స్ ఆసక్తిగానే ఉన్నా.. ఈ క్రమంలో జీతూ జోసెఫ్ మార్క్ లాజిక్ ఈ మూవీలో మిస్సయినట్లు రివ్యూయర్లు అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో థ్రిల్ కలిగించడం కోసం వాడిన పజిల్స్, ఫోన్ నంబర్లు, కోడ్ వర్డ్స్ అన్నీ చాలా కృత్రిమంగా అనిపిస్తాయి. ఇది బెడిసికొట్టడంతో మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఐఎండీబీలోనూ కేవలం 6 రేటింగ్ మాత్రమే నమోదైంది. అయితే ఈ మూవీలో లీడ్ రోల్స్ లో నటించిన బిజే మీనన్, జోజు జార్జ్ మాత్రం పోటాపోటీగా నటించారు. వీళ్ల నటనే మూవీకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ‘వలతు వశతే కల్లన్’ సినిమా థ్రిల్లింగ్‌గా ఉందా?
సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ద్వితీయార్థంలో వచ్చే పజిల్స్, కథనంలోని వేగం మందగించడం వల్ల థ్రిల్ కొంచెం తగ్గింది. అయితే బిజు మీనన్, జోజు జార్జ్ నటన కోసం ఒకసారి చూడొచ్చు.
2. ‘వలతు వశతే కల్లన్’ మూవీ తెలుగులో చూడొచ్చా?
ఈ మలయాళ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


