...
...
Next Story

ఓటీటీలోకి మీనా నటించిన మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. షో రన్నర్‌గా దృశ్యం డైరెక్టర్

మలయాళం నుంచి మరో ఆసక్తికరమైన థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రోస్లిన్’ డిజిటల్ రిలీజ్ కు సిద్ధమైంది. ప్రముఖ నటి మీనా, నటుడు వినీత్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ‘దృశ్యం’ దర్శకుడు జీతూ జోసెఫ్ దీనికి షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు.

Published on: Jan 27, 2026 08:39 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఈ ఏడాది మలయాళం నుంచి రాబోతున్న మొదటి వెబ్ సిరీస్‌గా ‘రోస్లిన్: సీక్రెట్ స్టోరీస్ అన్‌ఫోల్డ్’ (Roslin) నిలవనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ ద్వారా ఈ వెబ్ సిరీస్ డిజిటల్ అరంగేట్రం చేయనుందని అధికారికంగా ధృవీకరించారు. సీనియర్ నటి మీనా, ప్రముఖ నటుడు వినీత్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయనప్పటికీ ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

రోస్లిన్ ఎప్పుడు చూడొచ్చు?

ఓటీటీలోకి మీనా నటించిన మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. షో రన్నర్‌గా దృశ్యం డైరెక్టర్
ఓటీటీలోకి మీనా నటించిన మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. షో రన్నర్‌గా దృశ్యం డైరెక్టర్

గతేడాది డిసెంబరులో జరిగిన 'సౌత్ అన్‌బౌండ్' ఈవెంట్‌లో జియోహాట్‌స్టార్ అనౌన్స్ చేసిన ఐదు మలయాళ వెబ్ సిరీస్‌లలో ‘రోస్లిన్’ కూడా ఒకటి. ఇప్పుడు ఆ జాబితా నుంచి విడుదలవుతున్న మొదటి వెబ్ సిరీస్ ఇదేనని ప్లాట్‌ఫామ్ ఖరారు చేసింది. నిర్మాతలు అధికారిక తేదీని వెల్లడించకపోయినా.. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. వినాయక్ శశికమార్ కథను అందించగా, సుమేష్ నందకుమార్ దీనికి దర్శకత్వం వహించాడు.

రోస్లిన్ వెబ్ సిరీస్ కథేంటంటే?

‘రోస్లిన్’ అనే టీనేజ్ అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ అమ్మాయికి పదే పదే పీడకలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఆకుపచ్చ కళ్ళు ఉన్న ఒక ఆగంతకుడు ఆమెను వెంబడిస్తుంటాడు. ఆ అమ్మాయి భయాలు, ఆందోళనలు, వాటి ప్రభావం ఆమె కుటుంబంపై, చుట్టూ ఉన్నవారిపై ఎలా పడిందన్నదే ఈ వెబ్ సిరీస్ కథాంశం. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.

రోస్లిన్ వెబ్ సిరీస్ విశేషాలు

రోస్లిన్ వెబ్ సిరీస్ లో సంజన దిపు, హకీమ్ షా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సీనియర్ నటి మీనా, వినీత్ కూడా ఇందులో భాగం కావడం విశేషం. అన్నింటికంటే ముఖ్యంగా 'దృశ్యం' సిరీస్ తో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సిరీస్‌కు షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు.

జియోహాట్‌స్టార్‌లో మలయాళ కంటెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల నివిన్ పాలీ నటించిన 'ఫార్మా' అనే వెబ్ సిరీస్ గతేడాది డిసెంబర్ లో విడుదలైంది. పి.ఆర్. అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో నివిన్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా కనిపించాడు.

అలాగే 'కేరళ క్రైమ్ ఫైల్స్' సీజన్ 1, 2 అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు మూడో సీజన్‌కు కూడా పచ్చజెండా ఊపారు. వీటితో పాటు 'అనలి', 'కజిన్స్ & కళ్యాణమ్స్' అనే మరో రెండు సిరీస్‌లు కూడా జియో హాట్‌స్టార్‌లో రానున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe