Malayalam Web Series: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ మరో మలయాళ వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. జియోహాట్‌స్టార్ స్పెషల్ గా తెరకెక్కిన ఆ వెబ్ సిరీస్ పేరు ‘కాపీ స్క్వాడ్’. నలుగురి ఫ్రెండ్స్ స్టోరీగా ఈ సిరీస్ రెడీ అయింది. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
కాపీ స్క్వాడ్ ఓటీటీ రిలీజ్ డేట్

కాపీ స్క్వాడ్ (Kappi Squad) మలయాళ వెబ్ సిరీస్ డిజిటల్ డెబ్యూకు రెడీ అయింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో విడుదల కాబోతుంది. హాట్‌స్టార్ స్పెషల్స్‌గా వస్తున్న ఈ సుదీర్ఘ మలయాళ యూత్ డ్రామా సిరీస్ అక్టోబర్ 15, 2026 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
100 ఎపిసోడ్లు
కాపీ స్క్వాడ్ వెబ్ సిరీస్ సుదీర్ఘంగా సాగనుంది. ప్రతి వారం గురువారం నాడు నాలుగు కొత్త ఎపిసోడ్‌ల చొప్పున మొత్తం 100 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్‌ను ప్లాన్ చేశారు. ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఇది అందుబాటులోకి రాబోతోంది.
సిరీస్ స్టోరీ
ఈ కాపీ స్క్వాడ్ సిరీస్ కథ ప్రధానంగా కొచ్చి నగర నేపథ్యంలోని ఒక కేఫ్ చుట్టూ తిరుగుతుంది. నేటి తరం యువత ఎదుర్కొనే సవాళ్లు, వారి ఆశయాలు, ప్రేమ, స్నేహం, కెరీర్ చుట్టూ కథను చాలా ఆసక్తికరంగా మలిచారు. వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చిన నలుగురు ఫ్రెండ్స్ కలిసి తమ కలల కేఫ్ ను స్టార్ట చేస్తారు.
ఒక స్క్వాడ్ గా మారిన ఈ నలుగురి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? కేఫ్ ఎలా నడిచింది? అనేదే కాపీ స్క్వాడ్ మెయిన్ స్టోరీ. కామెడీ, ఎమోషన్స్ కలగలిసిన ఒక ఫీల్ గుడ్ డ్రామాగా దీనిని రూపొందించారు.
బిగ్ బాస్ ఫేమ్
{{/usCountry}}ఒక స్క్వాడ్ గా మారిన ఈ నలుగురి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? కేఫ్ ఎలా నడిచింది? అనేదే కాపీ స్క్వాడ్ మెయిన్ స్టోరీ. కామెడీ, ఎమోషన్స్ కలగలిసిన ఒక ఫీల్ గుడ్ డ్రామాగా దీనిని రూపొందించారు.
బిగ్ బాస్ ఫేమ్
{{/usCountry}}ఈ సిరీస్‌లో మలయాళ ఇండస్ట్రీకి చెందిన చెందిన పలువురు ప్రముఖ యువ నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ రినోష్ జార్జ్ ఈ సిరీస్‌లో ఒక కీలక పాత్రలో కనిపిస్తుండగా, అనఘా అజిత్, దియా దీపన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు జోయల్ జోసెఫ్, అభిరామి దయానందన్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రిజీ నాయర్ కూడా ఈ సిరీస్‌లో ఒక ప్రత్యేకమైన పాత్రలో భాగమయ్యారు.
యూత్ కు నచ్చేలా
ఈ వినూత్నమైన వెబ్ సిరీస్‌ను శ్రీకాంత్ మోహన్ సృష్టించగా (Created by), బెల్‌రాజ్ కలరిక్కల్ దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. ఫస్ట్ ప్రింట్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సిరీస్ అత్యంత నాణ్యమైన నిర్మాణ విలువలలో రూపొందింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యువతను విశేషంగా ఆకట్టుకుంటూ సిరీస్‌పై మంచి అంచనాలను పెంచేసింది.