Malayalam Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న 100 ఎపిసోడ్ల మలయాళ క్రేజీ వెబ్ సిరీస్..నలుగురు ఫ్రెండ్స్ స్టోరీ..ఎప్పుడంటే?
Malayalam Web Series: మలయాళం సినిమాలు, సిరీస్ లను తెలుగులో చూసే ఓటీటీ లవర్స్ కు ఓ అదిరిపోయే న్యూస్ ఇది. మలయాళంలో తెరకెక్కిన ఓ క్రేజీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఈ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. 100 ఎపిసోడ్ల ఈ సిరీస్ వివరాలపై ఓ లుక్కేయండి.
Malayalam Web Series: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ మరో మలయాళ వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. జియోహాట్‌స్టార్ స్పెషల్ గా తెరకెక్కిన ఆ వెబ్ సిరీస్ పేరు ‘కాపీ స్క్వాడ్’. నలుగురి ఫ్రెండ్స్ స్టోరీగా ఈ సిరీస్ రెడీ అయింది. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

కాపీ స్క్వాడ్ ఓటీటీ రిలీజ్ డేట్
కాపీ స్క్వాడ్ (Kappi Squad) మలయాళ వెబ్ సిరీస్ డిజిటల్ డెబ్యూకు రెడీ అయింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో విడుదల కాబోతుంది. హాట్‌స్టార్ స్పెషల్స్‌గా వస్తున్న ఈ సుదీర్ఘ మలయాళ యూత్ డ్రామా సిరీస్ అక్టోబర్ 15, 2026 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
100 ఎపిసోడ్లు
కాపీ స్క్వాడ్ వెబ్ సిరీస్ సుదీర్ఘంగా సాగనుంది. ప్రతి వారం గురువారం నాడు నాలుగు కొత్త ఎపిసోడ్‌ల చొప్పున మొత్తం 100 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్‌ను ప్లాన్ చేశారు. ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఇది అందుబాటులోకి రాబోతోంది.
సిరీస్ స్టోరీ
ఈ కాపీ స్క్వాడ్ సిరీస్ కథ ప్రధానంగా కొచ్చి నగర నేపథ్యంలోని ఒక కేఫ్ చుట్టూ తిరుగుతుంది. నేటి తరం యువత ఎదుర్కొనే సవాళ్లు, వారి ఆశయాలు, ప్రేమ, స్నేహం, కెరీర్ చుట్టూ కథను చాలా ఆసక్తికరంగా మలిచారు. వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చిన నలుగురు ఫ్రెండ్స్ కలిసి తమ కలల కేఫ్ ను స్టార్ట చేస్తారు.
ఒక స్క్వాడ్ గా మారిన ఈ నలుగురి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? కేఫ్ ఎలా నడిచింది? అనేదే కాపీ స్క్వాడ్ మెయిన్ స్టోరీ. కామెడీ, ఎమోషన్స్ కలగలిసిన ఒక ఫీల్ గుడ్ డ్రామాగా దీనిని రూపొందించారు.
బిగ్ బాస్ ఫేమ్
ఈ సిరీస్‌లో మలయాళ ఇండస్ట్రీకి చెందిన చెందిన పలువురు ప్రముఖ యువ నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ రినోష్ జార్జ్ ఈ సిరీస్‌లో ఒక కీలక పాత్రలో కనిపిస్తుండగా, అనఘా అజిత్, దియా దీపన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు జోయల్ జోసెఫ్, అభిరామి దయానందన్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రిజీ నాయర్ కూడా ఈ సిరీస్‌లో ఒక ప్రత్యేకమైన పాత్రలో భాగమయ్యారు.
యూత్ కు నచ్చేలా
ఈ వినూత్నమైన వెబ్ సిరీస్‌ను శ్రీకాంత్ మోహన్ సృష్టించగా (Created by), బెల్‌రాజ్ కలరిక్కల్ దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. ఫస్ట్ ప్రింట్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సిరీస్ అత్యంత నాణ్యమైన నిర్మాణ విలువలలో రూపొందింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యువతను విశేషంగా ఆకట్టుకుంటూ సిరీస్‌పై మంచి అంచనాలను పెంచేసింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


