Malayalam Cinema: క్యూట్ హీరోయిన్ గ్రేట్ రికార్డు.. మలయాళం సినిమా రికార్డులు తిరగరాసిన బెత్లెహెమ్ కుటుంబ యూనిట్
Malayalam Cinema: మలయాళం సినిమా రికార్డులు తిరగరాసింది క్యూట్ బ్యూటీ మమితా బైజు. ఆమె నివిన్ పౌలీతో కలిసి నటించిన బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
Malayalam Cinema: మలయాళ చిత్ర పరిశ్రమలో కొత్త చరిత్ర సృష్టించింది క్యూట్ హీరోయిన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ. యంగ్ హీరో నివిన్ పౌలీ, క్రేజీ బ్యూటీ మమితా బైజు కాంబినేషన్‌లో వచ్చిన 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. కేవలం 24 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.304.95 కోట్ల గ్రాస్ వసూలు చేసి మలయాళ బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ తిరగరాసింది.

మమితా లేటెస్ట్ మూవీ విశేషాలు
సినిమా పేరు: బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit)
కీలక నటీనటులు: నివిన్ పౌలీ (జస్టిన్), మమితా బైజు (యాష్లీ)
దర్శకత్వం: గిరీష్ ఏడీ (Girish A.D.)
నిర్మాణ సంస్థ: భావనా స్టూడియోస్ (ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్)
సంగీతం: విష్ణు విజయ్
ప్రపంచవ్యాప్త బాక్స్ ఆఫీస్ కలెక్షన్: రూ.304.95 కోట్లు (24 రోజుల్లో)
రూ.300 కోట్ల క్లబ్‌లో సరికొత్త రికార్డ్.. 'లోకా' మూవీ కలెక్షన్లు అవుట్
డైరెక్టర్ గిరీష్ ఏడీ తెరకెక్కించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విడుదలై మూడు వారాలైనా థియేటర్లలో ఏమాత్రం దూకుడు తగ్గకుండా దూసుకెళ్తోంది. గతంలో కళ్యాణి ప్రియదర్శన్ నటించిన సూపర్ హీరో మూవీ 'లోకా ఛాప్టర్ 1 చంద్ర' సాధించిన రూ.302 కోట్ల లైఫ్‌టైమ్ రికార్డును ఈ సినిమా నామరూపాల్లేకుండా చెరిపేసింది.
అంతేకాకుండా మోహన్‌లాల్ బిగ్గెస్ట్ హిట్స్ అయిన 'ఎల్ 2 ఎంపూరాన్' (రూ.265 కోట్లు), 'తుడరుమ్' (రూ.234 కోట్లు) చిత్రాల రికార్డులను కూడా చాలా సులువుగా దాటేసింది. నివిన్ పౌలీ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీగా నిలవడం విశేషం.
'ప్రేమలు' కాంబో మ్యాజిక్.. అసలు కథేంటంటే?
'ప్రేమలు' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు గిరీష్ ఏడీ, మమితా బైజుల కాంబినేషన్ కలసి చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. భావనా స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమా కథ ముండకాయం నుంచి కరుక్కుట్టికి మారిన యాష్లీ (మమితా బైజు) కుటుంబం చుట్టూ తిరుగుతుంది. తనకంటే వయసులో 12-13 ఏళ్లు పెద్దవాడైన పక్కింటి జస్టిన్ (నివిన్ పౌలీ)తో ఆమెకు ఏర్పడిన స్నేహం, ఆ తర్వాత అది ప్రేమగా మారే విధానాన్ని ఫీల్ గుడ్ ఎమోషన్లతో గిరీష్ ఏడీ స్క్రీన్ పై ఆవిష్కరించారు.
నివిన్ పౌలీకి సాలిడ్ కంబ్యాక్.. మమితా బైజు జోరు
గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నివిన్ పౌలీకి 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' ఊపిరి పోసింది. తనదైన మార్క్ టైమింగ్, పరిణతి చెందిన నటనతో జస్టిన్ పాత్రలో నివిన్ జీవించేశాడు. మమితా బైజు తన సహజసిద్ధమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది.
విష్ణు విజయ్ అందించిన మ్యూజిక్, అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫ్రెష్ లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ లోని ఫ్యామిలీ ఎమోషన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. తెలుగు, తమిళ భాషల్లోకి కూడా డబ్ అయి థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకుంటోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


