...
...
Next Story

Mamitha Baiju OTT: మమితా బైజు ట్రిపుల్ ధమాకా.. మూడు ఓటీటీల్లో ట్రెండింగ్ నంబర్ వన్ గా ఆమె సినిమాలే.. క్రేజ్ అదుర్స్!

Mamitha Baiju OTT: యంగ్ సెన్సేషన్ మమితా బైజు డామినెన్స్ మామూలుగా లేదు. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ఆమె.. ఓటీటీలోనూ తన దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పుడు ఒకే సమయంలో ఆమె నటించిన మూడు సినిమాలు మూడు వేర్వేరు ఓటీటీల్లో ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేసులో ఉన్నాయి.

Published on: Oct 4, 2026, 13:52:56 IST
Advertisement

Mamitha Baiju OTT: 'ప్రేమలు' చిత్రంతో సౌత్ ఇండియాలో క్రేజ్ సంపాదించుకున్న మమితా బైజు (Mamitha Baiju) ఫుల్ స్పీడ్ మీదుంది. ఒకే సమయంలో నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5 డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆమె నటించిన సినిమాలు నంబర్ 1 పొజిషన్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ 'ట్రిపుల్ విన్' సాధించి అరుదైన రికార్డును మమితా ఖాతాలో వేసుకుంది.

విశ్వనాథ్ అండ్ సన్స్

మమితా బైజు ట్రిపుల్ ధమాకా.. మూడు ఓటీటీల్లో ట్రెండింగ్ నంబర్ వన్ గా ఆమె సినిమాలే.. క్రేజ్ అదుర్స్!
మమితా బైజు ట్రిపుల్ ధమాకా.. మూడు ఓటీటీల్లో ట్రెండింగ్ నంబర్ వన్ గా ఆమె సినిమాలే.. క్రేజ్ అదుర్స్!

సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath & Sons) ఓటీటీని షేక్ చేస్తోంది. సెప్టెంబర్ 11న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. డిజిటల్ ప్రీమియర్ అయినప్పటి నుంచి టాప్ 10 జాబితాలో సుదీర్ఘకాలం కొనసాగుతున్న ఈ చిత్రం, ఇప్పుడు మళ్లీ ఇండియా లెవెల్లో నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకోవడం విశేషం.

బెత్లేహెం కుటుంబ యునిట్

మరోవైపు మమితా బైజు, నివిన్ పౌలీ కాంబినేషన్‌లో వచ్చిన 'బెత్లేహెం కుటుంబ యునిట్' (Bethlehem Kudumba Unit) జియోహాట్‌స్టార్ (JioHotstar)లో అదరగొడుతోంది. డిజిటల్ అరంగేట్రం చేసిన వెంటనే అత్యధిక వీక్షణలతో నంబర్ 1 స్థానంలో దూసుకుపోతోంది. ఈ ఓటీటీలో సినిమాల్లో ట్రెండింగ్ నంబర్ వన్ గా మమితా మూవీ ఉంది.

జన నాయగన్

ఇక దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ లో మమితా బైజు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ జీ5లో సత్తాచాటుతోంది. ఇప్పటికీ జీ5లో తమిళ సినిమాల్లో జన నాయగన్ టాప్ ప్లేసులో ఉంది. ఇలా ఒకేసారి మూడు ఓటీటీల్లో ఒకే హీరోయిన్ సినిమాలు టాప్ లో ఉండటమనేది మామూలు విషయం కాదు.

'ప్రేమలు' సినిమా విజయంతో ఒక్కసారిగా పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు.. తన కథల ఎంపికలో చూపిస్తున్న వైవిధ్యమే ఈ స్థాయి ఓటీటీ విజయాలకు కారణం. కమర్షియల్ ఎంటర్‌టైనర్ల నుంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాల వరకు ప్రతి పాత్రలోనూ తనదైన సహజ నటనతో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ.

సాధారణంగా ఒక నటుడికి ఒక ప్లాట్‌ఫామ్‌లో విజయం దక్కితే, మరొక ప్లాట్‌ఫామ్‌లో అదే సమయంలో అంతటి ఆదరణ రావడం కష్టం. కానీ నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5లలో ఒకేసారి నంబర్ 1 స్థానంలో మమితా బైజు సినిమాలు ట్రెండ్ కావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో మమితా టాప్ హీరోయిన్ గా ప్లేస్ కు వెళ్లిపోయిందని అంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks