...
...
Next Story

Mammootty: మమ్ముట్టి నుదుటిపై తిలకం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్.. బావిలో కప్పలంటూ దుమ్ముదులిపేసిన మలయాళం నటుడు

Mammootty: మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఈవెంట్ కు వెళ్లిన ముమ్ముట్టికి నుదుటిపై తిలకం దిద్ది ఆహ్వానించారు. ముస్లిం అయిన మమ్ముట్టి బొట్టు పెట్టుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ట్రోలింగ్ పై మరో మలయాళీ నటుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published on: Sep 27, 2026, 15:15:06 IST
Advertisement

Mammootty: 'భ్రమయుగం' సినిమాలో నటనకుగానూ జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్న మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చుట్టూ కాంట్రవర్సీ రేగింది. గుజరాత్‌లోని ఒక కార్యక్రమంలో స్థానిక మహిళ మమ్ముట్టి నుదుటిపై తిలకం దిద్ది స్వాగతం పలికిన వీడియో నెట్‌లో వైరల్ అయింది.

వివాదం ఏంటి?

మమ్ముట్టి నుదుటిపై తిలకం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్.. బావిలో కప్పలంటూ దుమ్ముదులిపేసిన మలయాళం నటుడు (Pic credit: Statue of Unity)
మమ్ముట్టి నుదుటిపై తిలకం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్.. బావిలో కప్పలంటూ దుమ్ముదులిపేసిన మలయాళం నటుడు (Pic credit: Statue of Unity)

'భ్రమయుగం' చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచినందుకుగానూ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మమ్ముట్టికి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది.

ఒక మహిళ ఆయనకు బొకే ఇచ్చి, నుదుటిపై తిలకం దిద్ది, త్రివర్ణ శాలువాతో సత్కరించింది. మమ్ముట్టి నవ్వుతూ ఆ స్వాగతాన్ని స్వీకరించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, ఆయన ముస్లిం అయి ఉండి నుదుటిపై తిలకం ఎలా పెట్టించుకుంటారంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించడం తీవ్ర వివాదానికి దారితీసింది.

బావిలో కప్పలు అంటూ ఫైర్!

అతిథులకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలకడం మన భారతీయుల సంస్కృతి అని హరిశ్రీ యూసుఫ్ స్పష్టం చేశారు. మతాన్ని మనుషుల మధ్య విద్వేషాలు పెంచడానికి కాకుండా మంచి మనుషులుగా తీర్చిదిద్దడానికి వాడాలని, మమ్ముట్టి ఎన్నో ఏళ్లుగా సమాజానికి సేవ చేస్తూ ఉచిత వైద్యం అందించే సంస్థలను పోషిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.

వరుస సినిమాలతో మమ్ముట్టి జోరు

మరోవైపు 70 ఏళ్ల వయసులోనూ మమ్ముట్టి వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీనిస్తున్నారు. ఈ ఏడాదే 'పేట్రియాట్' అనే స్పై యాక్షన్ థ్రిల్లర్‌తో అలరించారు. అంతే కాకుండా 'ఛాతా పచా', 'లా అండ్ ఆర్డర్' చిత్రాలలో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం తమిళంలో ధనుష్‌తో కలిసి 'ఓమ్ - ఛాప్టర్ 1: ఉధిరమ్' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. వీటితో పాటు మలయాళంలో 'పదయాత్ర', 'మేళా', 'మట్టన్‌చేరి మాఫియా' వంటి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks