మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మూవీ కలంకావల్ (Kalamkaval). బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.85 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. సుమారు 40 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. కనుమ సందర్భంగా సినిమా స్ట్రీమింగ్ మొదలవుతుంది.
కలంకావల్ ఓటీటీ రిలీజ్ డేట్

మమ్ముట్టి నటించిన కలంకావల్ సినిమాను సోనీ లివ్ ఓటీటీ జనవరి 16 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (జనవరి 9) తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. “నేరం కంటే లోతుగా విశ్లేషించే క్రైమ్ థ్రిల్లర్ లో మమ్ముట్టిని చూడండి. కలంకావల్ జనవరి 16 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాను మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ చూడొచ్చు.
కలంకావల్ మూవీ విశేషాలు
మలయాళం నుంచి వచ్చే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే మన ప్రేక్షకులకు ఎప్పుడూ ఆసక్తే. ఆ కోవలోకి చెందిన లేటెస్ట్ సినిమానే 'కలంకావల్'. ఈ సినిమా నిజ జీవితంలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ 'సయనైడ్ మోహన్' కథ ఆధారంగా రూపొందించారు.
కేరళ-తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళలను తీసుకెళ్లి, వారిని సయనైడ్ ఇచ్చి హత్య చేసే ఒక కిల్లర్ కథ ఇది. ఇందులో మమ్ముట్టి నెగటివ్ షేడ్స్ ఉన్న 'స్టాన్లీ దాస్' అనే సీరియల్ కిల్లర్ పాత్రలో నటించగా, అతడిని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ 'జయకృష్ణన్' పాత్రలో వినాయకన్ నటించారు. మమ్ముట్టి నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
బాక్సాఫీస్ వసూళ్లు
కలంకావల్ సినిమా మలయాళ చిత్ర పరిశ్రమలో 2025లో వచ్చిన అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. కేవలం 17 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇది మమ్ముట్టి కెరీర్‌లో అత్యంత వేగంగా రూ.50 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
{{/usCountry}}కలంకావల్ సినిమా మలయాళ చిత్ర పరిశ్రమలో 2025లో వచ్చిన అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. కేవలం 17 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇది మమ్ముట్టి కెరీర్‌లో అత్యంత వేగంగా రూ.50 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
{{/usCountry}}ఈ సినిమా ఒక నియో-నోయిర్ క్రైమ్ థ్రిల్లర్. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగే ఇన్వెస్టిగేషన్, మమ్ముట్టి-వినాయకన్ మధ్య సాగే మైండ్ గేమ్ సినిమాకు హైలైట్. మమ్ముట్టి గతంలో 'మున్నారియిప్పు' వంటి చిత్రాల్లో నెగటివ్ ఛాయలున్న పాత్రలు చేసినా, ఇందులో అతని క్రూరత్వం కొత్తగా ఉంటుందని మూవీ చూసిన వాళ్లు చెబుతున్నారు.