సంక్రాంతి బరిలో దిగిన మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సోమవారం (జనవరి 12) విడుదలైన ఈ సినిమా.. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ప్రభాస్ ‘రాజా సాబ్’తో పోటీ పడి మరీ చిరు ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం విశేషం.
బాస్ బ్యాటింగ్ మొదలైంది: అనిల్ రావిపూడి

చిరంజీవి, నయనతార లీడ్ రోల్స్ లో నటించిన మూవీ మన శంకరవరప్రసాద్ గారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చి సంచలనం సృష్టించిన అనిల్ రావిపూడి ఈసారి ఈ మూవీతోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంపై అనిల్ ఎమోషనల్ అయ్యాడు.
శుక్రవారం (జనవరి 16) సాయంత్రం తన ‘ఎక్స్’ ఖాతాలో చిరంజీవి పక్కన నిల్చున్న ఫోటోను షేర్ చేశాడు. వెనుక ‘200 కోట్లు’ అని రాసి ఉన్న పోస్టర్‌తో.. "ఇది కేవలం ఫస్ట్ పవర్-ప్లే మాత్రమే.. బాస్ బ్యాటింగ్ మొదలైంది. ఇన్ ఫ్రంట్ కలెక్షన్ల పండగ ఉంది. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు" అంటూ రాసుకొచ్చాడు.
చిరు ఇంట్లో గ్రాండ్ పార్టీ..
సినిమా విజయాన్ని పురస్కరించుకొని గురువారం (జనవరి 15) రాత్రి చిరంజీవి తన జూబ్లీహిల్స్ నివాసంలో చిత్ర బృందానికి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అలాగే సినిమాలో గెస్ట్ రోల్ చేసిన విక్టరీ వెంకటేష్ కూడా హాజరయ్యాడు. "నా హీరోలతో, మొత్తం టీమ్‌తో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మరిచిపోలేని అనుభూతి. చరణ్ రావడం చాలా ఆనందంగా ఉంది" అని అనిల్ పేర్కొన్నాడు.
టికెట్ల కోసం ఎగబడుతున్న జనం..
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి సెలవులు కావడం, సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో జనం థియేటర్లకు పోటెత్తుతున్నారు. డిమాండ్ దృష్ట్యా అదనపు షోలు, స్క్రీన్లు పెంచుతున్నట్లు నిర్మాత షైన్ స్క్రీన్స్ అధికారికంగా ప్రకటించింది.
{{/usCountry}}తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి సెలవులు కావడం, సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో జనం థియేటర్లకు పోటెత్తుతున్నారు. డిమాండ్ దృష్ట్యా అదనపు షోలు, స్క్రీన్లు పెంచుతున్నట్లు నిర్మాత షైన్ స్క్రీన్స్ అధికారికంగా ప్రకటించింది.
{{/usCountry}}గతేడాది కూడా అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఆ మూవీ రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇలా సీనియర్ హీరోలతో మూవీస్ తీస్తూ వాళ్ల కెరీర్ బెస్ట్ అందిస్తున్న అనిల్ రావిపూడి.. టాలీవుడ్ లో రాజమౌళి రేంజ్ క్రేజ్ సంపాదిస్తున్నాడు.