మెగాస్టార్ మేనియా-ఇండియాలోనే 100 కోట్లు కొల్లగొట్టేసిన మన శంకర వర ప్రసాద్ గారు-ఆ సినిమాలను దాటి

'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది! చిరంజీవి, నయనతార నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ 4వ రోజున కూడా అదరగొట్టింది. ఇండియాలోనే రూ.100 కోట్ల కలెక్షన్లు దాటేసింది.

Published on: Jan 16, 2026 5:42 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగాస్టార్ చిరంజీవి హీరగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' (MSVPG). సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదలైంది ఈ చిత్రం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పాజిటివ్ టాక్ తో సాగిపోతుంది. బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది.

మన శంకర వరప్రసాద్ గారులో నయనతార, చిరంజీవి
మన శంకర వరప్రసాద్ గారులో నయనతార, చిరంజీవి

మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్లు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఫ్యామిలీ చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. సక్నిల్క్ ప్రకారం చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం దేశీయంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. సంక్రాంతి రోజు (జనవరి 15) ఈ మూవీ ఇండియాలో రూ.24.14 కోట్ల నెట్ వసూళ్లు కథలో వేసుకుందని ట్రేబ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ పేర్కొంది.

రూ.100 కోట్ల క్లబ్

చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఇండియాలోనే నెట్ కలెక్షన్ల పరంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. నివేదిక ప్రకారం ప్రీమియర్‌ల ద్వారా చిత్రం రూ.9.35 కోట్లు వసూలు చేసింది. విడుదలైన మొదటి రోజు రూ.32.25 కోట్లు, 2వ రోజు రూ.18.75 కోట్లు, 3వ రోజు రూ.19.5 కోట్లు వసూలు చేసింది. 4వ రోజున రూ.24.14 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇప్పటివరకు ఇండియాలో రూ.103.99 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. గురువారం శంకర వరప్రసాద్ చిత్రానికి మొత్తం 75.10% తెలుగు ఆక్యుపెన్సీ ఉంది.

ఆ సినిమాలను దాటి

మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం చిరంజీవి గత సినిమాల జీవితకాల వసూళ్లను అధిగమించింది. 'భోళా శంకర్' రూ.30.63 కోట్లు, 'ఆచార్య' రూ.56.14 కోట్లు, 'గాడ్ ఫాదర్' రూ.74.03 కోట్లు వసూలు చేశాయి. 'వాల్తేరు వీరయ్య' చిత్రం రూ.161.06 కోట్ల ఇండియా కలెక్షన్లను అందుకునే దిశగా మన శంకర వర ప్రసాద్ గారు సాగుతోంది.

మన శంకర వర ప్రసాద్ గారు గురించి

ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. ఈ చిత్రంలో వెంకటేష్, కేథరిన్ ట్రెసా కూడా నటించారు. ఈ కథ ఒక జాతీయ భద్రతా అధికారి తన విడిపోయిన భార్య, పిల్లలను రక్షించి, వారితో తిరిగి కలవడానికి ప్రయత్నించే నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాకు చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ నుంచి టైటిల్ పెట్టారు.

ఆరు సంవత్సరాల తర్వాత విడిపోయిన తన భార్య, పిల్లలను ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న మాజీ పోలీసు నుండి రక్షించే భద్రతా అధికారి, వారి సంబంధాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ఒక అవకాశంగా భావిస్తాడు. ఈ మూవీకి అదనపు షోలు కూడా యాడ్ చేశారు. చిత్ర విజయాన్ని జరుపుకోవడానికి చిరంజీవి తన జూబ్లీహిల్స్ నివాసంలో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్ తో సహా మెగా కుటుంబ సభ్యులు పలువురు అభిమానులతో కలిసి థియేటర్లలో చిత్రాన్ని వీక్షించారు.