ఈసారి మన శంకరవరప్రసాద్ గారు మూవీతో సంక్రాంతి బరిలో నిలిచాడు మెగాస్టార్ చిరంజీవి. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా శుక్రవారం (జనవరి 9) ఏపీలో టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏ పెద్ద సినిమా వస్తున్నా టికెట్ల పెంపు జీవోలు సాధారణంగా మారిపోయాయి.
ఏపీలో టికెట్ల ధరలు ఇలా..

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు మూవీ టికెట్ల ధరలు పెరిగాయి. జనవరి 12న మూవీ రిలీజ్ కానుంగా.. జనవరి 11న రాత్రి వేయబోయే స్పెషల్ ప్రీమియర్ షోలకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. ఇక రిలీజ్ రోజు నుంచి మొదటి పది రోజుల వరకు టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతిచ్చారు.
సింగిల్ స్క్రీన్ అయితే రూ.100, మల్టీప్లెక్స్ అయితే రూ.125 పెంచుకోవచ్చని స్పష్టం చేశారు. దీంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.247, మల్టీప్లెక్స్ లో రూ.302కు చేరనుంది. అంతేకాదు ఈ పది రోజులు రోజుకు ఐదు షోలకు కూడా అనుమతి ఇవ్వడం విశేషం.
మన శంకరవరప్రసాద్ గారు విశేషాలు
చిరు, అనిల్ కాంబినేషన్ అనగానే ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. అందులోనూ సంక్రాంతి సమయంలో ఈ మన శంకరవరప్రసాద్ గారు వస్తుండటంతో అనిల్ రావిపూడి ఖాతాలో మరో హిట్ పడినట్లే అని ముందుగానే ఫ్యాన్స్ డిసైడయ్యారు. ఇక ది రాజా సాబ్ కు వస్తున్న మిక్స్‌డ్ రివ్యూలు కూడా ఈ సినిమాకు కలిసి రానున్నాయి.
మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటించగా.. వెంకటేశ్ కీలకపాత్రలో నటించాడు. అతని ఎక్స్టెండెడ్ కామియో రోల్ చాలా ఆసక్తి రేపుతోంది. గతేడాది వెంకీతోనే సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి.. ఈసారి కూడా అదే రిపీట్ చేస్తాడన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. భీమ్స్ సీసిరోలియో మ్యూజిక్ అందించాడు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల మూవీని నిర్మించారు.
{{/usCountry}}మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటించగా.. వెంకటేశ్ కీలకపాత్రలో నటించాడు. అతని ఎక్స్టెండెడ్ కామియో రోల్ చాలా ఆసక్తి రేపుతోంది. గతేడాది వెంకీతోనే సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి.. ఈసారి కూడా అదే రిపీట్ చేస్తాడన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. భీమ్స్ సీసిరోలియో మ్యూజిక్ అందించాడు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల మూవీని నిర్మించారు.
{{/usCountry}}మన శంకరవరప్రసాద్ గారు నుంచి ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనిల్ రావిపూడి తనదైన స్టైల్ ప్రమోషన్లు ప్లస్ కానున్నాయి. ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెసైంది. జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.