మెగాస్టారా మజాకా? 70 ఏళ్ల వయసులోనూ ఇండస్ట్రీ రికార్డులనే కాదు.. ఓటీటీ రికార్డులను కూడా తిరగరాసేస్తున్నాడు చిరంజీవి. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరు నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టిన 24 గంటల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ తో ఊహకందని రికార్డును సొంతం చేసుకుంది.
జీ5 ఓటీటీలో మెగాస్టార్ ర్యాంపేజ్

ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన మూవీ మన శంకరవరప్రసాద్ గారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్లకుపైగా వసూలు చేసి చిరు కెరీర్లోనే అత్యధిక వసూళ్ల సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర అంతలా చెలరేగుతున్నా నెల రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకొచ్చి మేకర్స్ ఆశ్చర్యపరిచారు. జీ5 ఓటీటీలో ఫిబ్రవరి 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే 24 గంటల్లోనే ఈ మూవీ 200 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు సాధించినట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ స్పెషల్ వీడియోను షేర్ చేస్తూ.. జీ5 ఓటీటీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీ అని వెల్లడించింది. గతంలో ఆర్ఆర్ఆర్ లాంటి మూవీకి కూడా ఈ ఓటీటీలో సాధ్యం కాని రికార్డు ఇది. దీనిని బట్టి మన శంకరవరప్రసాద్ గారు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మన శంకరవరప్రసాద్ గారు విశేషాలు
గతేడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈసారి చిరంజీవితో ఈ మన శంకరవరప్రసాద్ గారుతో వచ్చాడు. అంచనాలు భారీగానే ఉన్నా.. వాటన్నింటినీ మించిపోయి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది ఈ సినిమా. చిరు, నయనతార జోడీ.. వెంకటేశ్ కామియో రోల్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. చాలా రోజుల తర్వాత చిరంజీవి మార్క్ కామెడీని ఇందులో చూడొచ్చు.
థియేటర్లలో ఇంతటి భారీ విజయం సాధించిన సినిమాపై సహజంగానే ఓటీటీలోనూ అంచనాలు భారీగానే ఉంటాయి. జీ5 ఓటీటీకి ఇప్పుడదే కలిసి వస్తోంది. ఈ సినిమాను ఏకంగా ఏడు భాషల్లో తీసుకొచ్చిన ఈ ఓటీటీకి వ్యూయర్స్ క్యూ కడుతున్నారు. కేవలం 24 గంటల్లోనే 200 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అంటే మామూలు విషయం కాదు. రానున్న రోజుల్లో ఈ మూవీ మరిన్ని రికార్డులు తిరగ రాయడం ఖాయంగా కనిపిస్తోంది.
{{/usCountry}}థియేటర్లలో ఇంతటి భారీ విజయం సాధించిన సినిమాపై సహజంగానే ఓటీటీలోనూ అంచనాలు భారీగానే ఉంటాయి. జీ5 ఓటీటీకి ఇప్పుడదే కలిసి వస్తోంది. ఈ సినిమాను ఏకంగా ఏడు భాషల్లో తీసుకొచ్చిన ఈ ఓటీటీకి వ్యూయర్స్ క్యూ కడుతున్నారు. కేవలం 24 గంటల్లోనే 200 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అంటే మామూలు విషయం కాదు. రానున్న రోజుల్లో ఈ మూవీ మరిన్ని రికార్డులు తిరగ రాయడం ఖాయంగా కనిపిస్తోంది.
{{/usCountry}}