...
...
Next Story

అఫీషియల్.. మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే.. స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేసిన ప్లాట్‌ఫామ్.. 7 భాషల్లో..

మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. కమింగ్ సూన్ అంటూ వీడియో రిలీజ్ చేసిన జీ5 ఓటీటీ.. మరుసటి రోజే తన ప్లాట్‌ఫామ్ కేటలాగ్ లో స్ట్రీమింగ్ తేదీ రివీల్ చేసింది.

Published on: Feb 4, 2026, 15:22:19 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మన శంకరవరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న జీ5 ఓటీటీ ఒక రోజు ముందే ఓ స్పెషల్ వీడియోతో బాస్ ఈజ్ కమింగ్ అంటూ టీజ్ చేసింది. ఇప్పుడు స్ట్రీమింగ్ ఫిబ్రవరి 11 నుంచే అంటూ కన్ఫమ్ చేసింది.

మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ డేట్

అఫీషియల్.. మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే.. స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేసిన ప్లాట్‌ఫామ్.. 7 భాషల్లో..
అఫీషియల్.. మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే.. స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేసిన ప్లాట్‌ఫామ్.. 7 భాషల్లో..

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ వచ్చే వారమే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. థియేటర్లలో రిలీజైన సరిగ్గా నెల రోజులకు డిజిటల్ ప్రీమియర్ కానుంది. వచ్చే బుధవారం అంటే ఫిబ్రవరి 11 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

అది కూడా ఏడు భాషల్లో కావడం విశేషం. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో రానుంది. ఈ విషయాన్ని జీ5 తన ప్లాట్‌ఫామ్ లో కన్ఫమ్ చేసింది. ఈ మూవీ గురించి సెర్చ్ చేసినప్పుడు కింద స్ట్రీమింగ్ డేట్ ఫిబ్రవరి 11 అని ఉంది.

మన శంకరవరప్రసాద్ గారు రికార్డు

ఈ ఏడాది రిలీజైన సంక్రాంతి సినిమాల్లో చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు అన్నింటి కంటే మెగా బ్లాక్‌బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400 కోట్ల వరకూ గ్రాస్ వసూళ్లు సాధించింది.

ఇండియాలోనే రూ.200 కోట్లకుపైగా నెట్ వసూళ్లు రావడం విశేషం. చిరంజీవి, నయనతారతోపాటు ఈ మూవీలో వెంకటేశ్ కూడా ఎక్స్‌టెండెడ్ గెస్ట్ రోల్లో నటించిన విషయం తెలిసిందే. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈసారి అంతకంటే పెద్ద హిట్ అందించాడు. చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు మూవీగా నిలవడంతో అతడు.. అనిల్ కు ఓ లగ్జరీ కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే. అలాంటి మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుండటంతో ప్రేక్షకులు మరింత ఆసక్తిగా రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe