...
...
Next Story

ఓటీటీలోకి 7 భాషల్లో మన శంకరవరప్రసాద్ గారు.. బాస్ ఈజ్ కమింగ్ అంటూ వీడియో రిలీజ్

మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సంక్రాంతికి మెగా బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ గురించి జీ5 ఓటీటీలో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసింది. బాస్ ఈజ్ కమింగ్ అంటూ టీజ్ చేసింది.

Published on: Feb 3, 2026, 14:11:51 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాస్ ఈజ్ కమింగ్.. ఓటీలోకి మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటించిన మన శంకరవరప్రసాద్ గారు రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ వెల్లడించకపోయినా.. కమింగ్ సూన్ అంటూ జీ5 ఓటీటీ ఓ అదిరిపోయే వీడియోను మంగళవారం (ఫిబ్రవరి 3) రిలీజ్ చేసింది. అయితే ఫిబ్రవరి 11 నుంచి సినిమా స్ట్రీమింగ్ ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ డేట్

ఓటీటీలోకి 7 భాషల్లో మన శంకరవరప్రసాద్ గారు.. బాస్ ఈజ్ కమింగ్ అంటూ వీడియో రిలీజ్
ఓటీటీలోకి 7 భాషల్లో మన శంకరవరప్రసాద్ గారు.. బాస్ ఈజ్ కమింగ్ అంటూ వీడియో రిలీజ్

సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజై ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల వరకూ వసూలు చేసిన మూవీ మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. జీ5 ఓటీటీ రిలీజ్ చేసిన వీడియో ఆసక్తి రేపుతోంది.

“మన శంకరవరప్రసాద్ గారు. ది బాస్, ది మెగాస్టార్. జీ5లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చూస్తూనే ఉండండి” అనే క్యాప్షన్ తో వీడియోను ట్వీట్ చేసింది. ఇందులో చిరంజీవి, నయనతార, వెంకటేశ్ కీలకమైన మూమెంట్స్ ను చూడొచ్చు. చివర్లో బాస్ ఈజ్ కమింగ్ అని చెప్పారు.

ఏడు భాషల్లో స్ట్రీమింగ్

మన శంకరవరప్రసాద్ గారు మూవీ ఏకంగా ఏడు భాషల్లో ఓటీటీలోకి రానుండటం విశేషం. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది. ఇన్ని భాషల్లో వస్తుండటంతో సినిమాకు థియేటర్లలో కంటే ఓటీటీలో మరింత అదిరిపోయే రెస్పాన్స్ రానుందని మూవీ టీమ్ భావిస్తోంది.

మన శంకరవరప్రసాద్ గారు రికార్డు

ఇండియాలోనే రూ.200 కోట్లకుపైగా నెట్ వసూళ్లు రావడం విశేషం. చిరంజీవి, నయనతారతోపాటు ఈ మూవీలో వెంకటేశ్ కూడా ఎక్స్‌టెండెడ్ గెస్ట్ రోల్లో నటించిన విషయం తెలిసిందే. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈసారి అంతకంటే పెద్ద హిట్ అందించాడు. చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు మూవీగా నిలవడంతో అతడు.. అనిల్ కు ఓ లగ్జరీ కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే. అలాంటి మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుండటంతో ప్రేక్షకులు మరింత ఆసక్తిగా రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe