మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా.. సోషల్ మీడియాలో క్రేజీ బజ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ డేట్ పై క్రేజీ బజ్ నెలకొంది. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Published on: Jan 30, 2026, 21:11:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మన శంకరవరప్రసాద్ గారు.. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఇండియాలో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. 18 రోజుల్లో ఈ మూవీ ఇండియాలోనే ఏకంగా రూ.201.95 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా.. సోషల్ మీడియాలో క్రేజీ బజ్
మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా.. సోషల్ మీడియాలో క్రేజీ బజ్

మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ డేట్

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన మూవీ మన శంకరవరప్రసాద్ గారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 ఓటీటీ దక్కించుకుంది. జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఫిబ్రవరి 11 నుంచి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాను ఇంత త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తారా అన్నదీ సందేహమే. మరి దీనిపై మూవీ టీమ్, ఓటీటీ పార్ట్‌నర్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మన శంకరవరప్రసాద్ గారు మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.360 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్ల సినిమా ఇది.

ఓటీటీలోకి క్యూ కట్టిన సంక్రాంతి సినిమాలు

ఈ ఏడాది సంక్రాంతికి నేరుగా తెలుగులోనే ఐదు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో రెండు సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్లు కన్ఫమ్ అయ్యాయి. వీటిలో అన్నింటి కంటే ముందుగా డిజిటల్ ప్రీమియర్ కానుంది శర్వానంద్ కామెడీ డ్రామా నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమా ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ఇక ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ కూడా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాను జియోహాట్‌స్టార్ ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. అటు తమిళ మూవీ పరాశక్తి కూడా జీ5 ఓటీటీలోకి ఫిబ్రవరి 7నే అడుగుపెట్టనుంది. మరోవైపు రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ కూడా ఫిబ్రవరి 13న ఓటీటీలోకి వస్తున్నట్లు వార్తలు వచ్చినా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనగనగా ఒక రాజు మూవీ విషయంలోనే ఇంకా ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More