Manchu Manoj Bhuma Mounika: భార్య భూమా మౌనిక బర్త్ డే- ఏందయ్య సామీ పాటతో మంచు మనోజ్ స్పెషల్ వీడియో

Manchu Manoj Birthday Wishes To Wife Mounika: తన భార్య మౌనిక భూమా మంచు పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. జీవితంలో కష్టసమయాల్లో తనను నడిపించిన దైవం మౌనిక అని కొనియాడుతూ, ఆమె సేవారంగానికి అండగా ఉంటానని ప్రకటించారు.

Published on: Oct 4, 2026, 19:22:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Manchu Manoj Birthday Wishes To Wife Mounika: టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన సగభాగం మౌనిక భూమా మంచు పుట్టినరోజు సందర్భంగా పంచుకున్న భావోద్వేగ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, తనను నమ్మి ముందుకు నడిపించిన వ్యక్తి మౌనిక అని ఆయన మురిసిపోయారు.

భార్య భూమా మౌనిక బర్త్ డే- ఏందయ్య సామీ పాటతో మంచు మనోజ్ స్పెషల్ వీడియో
భార్య భూమా మౌనిక బర్త్ డే- ఏందయ్య సామీ పాటతో మంచు మనోజ్ స్పెషల్ వీడియో

ఏందయ్య సామీ పాటతో వీడియో

ఇద్దరూ కలిసి పంచుకుంటున్న ఈ అందమైన ప్రయాణంలో మౌనిక పాత్రను స్మరించుకుంటూ ఒక ప్రత్యేక వీడియో రీల్‌‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు హీరో మంచు మనోజ్. ఈ వీడియోకు రణబాలిలోని ఏందయ్య సామీ పాటను యాడ్ చేసి మరింత ఎమోషనల్ అండ్ క్యూట్‌గా చూపించారు.

మనోజ్, మౌనికల వివాహం

మనోజ్, మౌనికల వివాహం టాలీవుడ్ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఎంతో ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. రాయలసీమ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన భూమా కుటుంబానికి చెందిన మౌనికను వివాహం చేసుకున్న తర్వాత, మనోజ్ జీవితం మళ్లీ కొత్త రూపు సంతరించుకుంది.

మౌనిక ఇచ్చిన మానసిక స్థైర్యమే

సినిమాలకు కొంతకాలం దూరమైన సమయంలో మౌనిక ఇచ్చిన మానసిక స్థైర్యమే తానిప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి, సంతోషంగా జీవించడానికి కారణమని మంచు మనోజ్ పలు వేదికలపై చెబుతుంటారు.

కష్టసమయాల్లో కొండంత అండగా నిలిచింది!

తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన వీడియోలో మౌనికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మనోజ్ అత్యంత ప్రేమపూర్వకమైన వ్యాఖ్యలు చేశారు. "నా జీవితంలో అత్యంత చీకటి రోజుల్లోనూ, తిరిగి నాకాళ్లపై నేను నిలబడే ప్రయాణంలోనూ మౌనిక అందించిన అండ, చూపించిన నమ్మకం నాకు ఎనలేని బలాన్ని ఇచ్చాయి" అని మంచు మనోజ్ స్పష్టం చేశారు.

ఒకరికొకరు తోడుగా

కుటుంబ బంధాలు, పిల్లల పెంపకం, ఒకరికొకరు తోడుగా ఉండే విషయంలో మౌనిక చూపే చొరవను ఆయన ఎంతగానో ప్రశంసించారు. కలిసి నిర్మించుకున్న ఈ అందమైన కుటుంబం తనకెంతో విలువైనదని పేర్కొన్నారు.

'ఐక్యా' ధైర్య సేన సమితి వెనుక ఉన్న నిజమైన హృదయం!

కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా, సమాజసేవలోనూ మౌనిక తనదైన ముద్ర వేస్తున్నారని మనోజ్ వెల్లడించారు. 'నమస్తే వరల్డ్', 'ఐక్యా' (AIKYA) ధైర్య సేన సమితి ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ పేదలకు, అనాథలకు సాయం అందిస్తున్న ఆమె ఉదారతను అభినందించారు.

సమాజానికి మంచి చేయాలనే తపన

"నా పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రారంభించిన 'ఐక్యా' ఆలోచన వెనుక ఉన్న అసలైన హృదయం, ప్రేరణ మౌనికే. సమాజానికి ఏదైనా మంచి చేయాలనే ఆమె తపన నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది" అని మంచు మనోజ్ వ్యాఖ్యానించారు.

కుటుంబమంతా కొండంత అండగా

మౌనిక కనే ప్రతి కలకు, ఆమె చేపట్టే ప్రతి సామాజిక కార్యక్రమానికి తమ కుటుంబమంతా కొండంత అండగా ఉంటుందని మనోజ్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ భావోద్వేగ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా, మంచు అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు మౌనిక భూమా మంచుకు సామాజిక మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More