...
...
Next Story

Manchu Manoj: మంచు మనోజ్ మంచి మనసు.. మతి స్థిమితం లేని వ్యక్తికి కొత్త జీవితం.. స్వయంగా హెయిర్ కట్.. వీడియో వైరల్

Manchu Manoj: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. మతిస్థిమితం లేని ఓ మానసిక వికలాంగుడికి మనోజ్ స్వయంగా హెయిర్ కట్ చేశాడు. అనాథ ఆశ్రమానికి అండగా ఉంటానని హామీ కూడా ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Published on: May 26, 2026, 13:48:00 IST
Advertisement

Manchu Manoj: సినిమాల్లో విలక్షణమైన నటనతో మెప్పించడమే కాకుండా నిజ జీవితంలోనూ మంచి మనసుతో రియల్ హీరోగా నిలుస్తున్నాడు మంచు మనోజ్. సినీ పరిశ్రమలో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్.. నిజ జీవితంలోనూ తన ఉదారతను చాటుకున్నాడు. తాజాగా అతని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మంచు మనోజ్ మంచి మనసు

మతిస్థిమితం లేని వ్యక్తికి హెయిర్ కట్ చేస్తున్న మంచు మనోజ్ (x)
మతిస్థిమితం లేని వ్యక్తికి హెయిర్ కట్ చేస్తున్న మంచు మనోజ్ (x)

సమాజంలో అణగారిన, నిరుపేద ప్రజలకు సహాయం చేయడానికి మంచు మనోజ్ ఎల్లప్పుడూ ముందుంటాడు. ఇందులో భాగంగానే, తాజాగా ఆయన చేపట్టిన ఒక సేవా కార్యక్రమం సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ​ఇటీవల ప్రారంభమైన ‘సెలబ్రిటీ రీబర్త్ ఛాలెంజ్’ (Celebrity Rebirth Challenge) లో మంచు మనో పాల్గొన్నాడు.

అనాథకు సరికొత్త జీవితం

ఈ సెలబ్రిటీ రీబర్త్ ఛాలెంజ్ అనే వినూత్న సవాల్‌ను స్వీకరించిన మంచు మనోజ్ ఒక అనాథకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించాడు. హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట ప్రధాన రహదారిపై మానసిక స్థితి సరిగ్గా లేక, దీన స్థితిలో సంచరిస్తున్న ఒక వ్యక్తిని స్థానిక మాతృదేవోభవ ఆశ్రమ నిర్వాహకులు చేరదీశారు.

తన చేతులతో

​మానసిక వికలాంగుడిని ఆశ్రమానికి తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న మంచు మనోజ్ వెంటనే స్పందించాడు. ఆ వ్యక్తి వద్దకు వెళ్లి, స్వయంగా తన చేతులతో అతనికి హెయిర్ కట్ చేశాడు. గడ్డం కూడా పూర్తిగా గీసి, ముఖాన్ని శుభ్రం చేశాడు.

ఆ అనాథ వ్యక్తికి మంచు మనోజ్ కొత్త బట్టలు కూడా అందించాడు. సాధారణ మనిషిలా సమాజంలో తిరిగేలా ఒక సరికొత్త రూపాన్ని ఇచ్చాడు. ఆ వ్యక్తికి మంచు మనోజ్ హెయిర్ కట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. మనోజ్ అన్నది మంచి మనసు అనే కామెంట్లు వస్తున్నాయి.

ఆశ్రమానికి అండగా

ఇటీవల తన బర్త్ డే సందర్భంగా అయిదుగురు పిల్లలను మంచు మనోజ్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. తన భార్య మౌనికతో కలిసి అతను ఐక్య ధైర్య సేన సమితిని కూడా ప్రారంభించాడు.

వరుస సినిమాలతో

ఎనర్జిటిక్ యాక్టింగ్ తో అభిమానులను సంపాదించుకున్న మంచు మనోజ్ మధ్యలో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. మిరాయ్ మూవీలో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. డేవిడ్ రెడ్డి, వడ్డీ కాసులవాడ సినిమాలు చేస్తున్నాడు. అలాగే గోపీచంద్ మలినేని-బాలయ్య బాబు కాంబినేషన్లో వస్తున్న మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe