Manchu Manoj: అమ్మానాన్న ప్రతీది మీతోనే స్టార్ట్ అయింది.. నా భార్మ నమ్మింది.. సైమా అవార్డుతో మంచు మనోజ్.. ఎమోషనల్ ట్వీట్
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. సైమా అవార్డులో బెస్ట్ విలన్ గా నిలిచిన అతను.. తన సంతోషాన్ని ట్విటర్ లో పంచుకున్నారు. ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ తో లెంగ్తీ పోస్టు రాసుకొచ్చారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇందులో అమ్మానాన్నలు, భార్య గురించి చెప్పుకొచ్చారు మనోజ్.
Manchu Manoj: 2025 సెప్టెంబర్ 12న థియేటర్లలోకి వచ్చిన తేజ సజ్జా, మంచు మనోజ్ ల భారీ చిత్రం 'మిరాయ్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఏడాది తర్వాత, 2026 సెప్టెంబర్ 12న అదే తేదీన సైమా (SIIMA) వేదికపై 'ది బ్లాక్ స్వోర్డ్' పాత్రకు గానూ మంచు మనోజ్ బెస్ట్ విలన్ అవార్డును అందుకున్నారు.

మంచు మనోజ్ ఎమోషనల్
సైమా 2026 అవార్డుల్లో మంచు మనోజ్ తెలుగు సినిమాలకు గాను బెస్ట్ విలన్ గా నిలిచారు. అవార్డు గెలుచుకున్న అనంతరం మనోజ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతోంది. తన భార్య మౌనికతో కలిసి దిగిన ఫొటోను మంచు మనోజ్ పోస్టు చేశారు.
నన్ను నమ్మిన భార్య
"నేను నా భవిష్యత్తును సరిగ్గా ఊహించలేక ఇబ్బందిపడుతున్న సమయంలో మౌనిక నా జీవితంలోకి వచ్చి నన్ను నమ్మింది. 'మిరాయ్' షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆమె కడుపులో మన చిన్నారి దేవసేన ఉంది.. కొడుకు ధైరవ్ నన్ను చూసి నవ్వేవాడు. సైమా ఈవెంట్లో నా భార్య, పిల్లలు కూర్చుని నేను అవార్డు తీసుకోవడం చూసిన క్షణాన్ని నా జీవితాంతం గుర్తుంచుకుంటాను" అని మనోజ్ రాసుకొచ్చారు.
అమ్మానాన్నల నుంచే
"అమ్మా నాన్నల నుంచే నాకు సినిమా పట్ల ప్రేమ, విలువలు.. ఇలా ప్రతీది స్టార్ట్ అయింది. ఇక నా అక్క లక్ష్మి.. నా కెరీర్ రూపుదిద్దుకోక ముందే నన్ను ఒక తల్లిలా నమ్మింది. నా కోసం ప్రార్థించిన ప్రతి అభిమానికి ఈ అవార్డు అంకితం"
"ఏమీ లేని స్థితి నుంచి మళ్లీ జీవితాన్ని కట్టుకోవడంలో ఒక గౌరవం ఉంది. ఎవరూ చూడకపోయినా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండి.. విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది" అని మంచు మనోజ్ పోస్టు చేశారు.
'ది బ్లాక్ స్వోర్డ్' హింట్
టాలీవుడ్‌లో హీరోగా కెరీర్ ప్రారంభించి, సుదీర్ఘ విరామం తర్వాత నెగెటివ్ లేదా యాంటీ-హీరో షేడ్స్ ఉన్న పాత్రలతో మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చిన నటుల జాబితాలో (జగపతి బాబు, రాణా దగ్గుబాటి తరహాలో) మంచు మనోజ్ చేరిపోయారు.
మిరాయ్ చిత్రంలో 'ది బ్లాక్ స్వోర్డ్' పాత్ర కేవలం రెగ్యులర్ విలన్ కాదు. కార్తీక్ ఘట్టమనేని డిజైన్ చేసిన విజువల్స్, మనోజ్ బాడీ లాంగ్వేజ్, గంభీరమైన వాయిస్ ఆ పాత్రను ఐకానిక్‌గా మార్చాయి. తన ఎమోషనల్ పోస్టు ముగింపులో "కార్తీక్, కృతి.. మన బ్లాక్ స్వోర్డ్ సిరీస్ ఎప్పుడు ప్రారంభిస్తున్నాం?" అని మనోజ్ పేర్కొనడం విశేషం. దీంతో బ్లాక్ స్టోర్డ్ అనేది సిరీస్ గా వస్తుందనే టాక్ వినిపిస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


