Netflix Trending: థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి పక్కా కమర్షియల్ సక్సెస్‌గా నిలిచిన తమిళ సినిమా ‘మండాడి’ ఓటీటీలోనూ అదరగొడుతోంది. డిజిటల్ స్క్రీన్‌పై కూడా బిగ్గెస్ట్ మనీ స్పిన్నర్‌గా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఈ సినిమా సాధిస్తున్న వ్యూయర్ షిప్ నెంబర్లే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్‌లో టాప్ 3

అక్టోబర్ 12 నుంచి 18వ తేదీ వరకూ సంబంధించిన గ్లోబల్ టాప్ చార్ట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా విడుదల చేసింది. ఇందులో నాన్-ఇంగ్లీష్ (Non-English) సినిమాల కేటగిరీలో ‘మండాడి’ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఈ వారం వ్యవధిలోనే ఈ సినిమాకు ఏకంగా 22 లక్షల వ్యూస్ రావడం విశేషం.
ఒకటే సినిమా
నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో ఇండియా నుంచి మండాడి టాప్ లో ఉంది. అలాగే ఈ లిస్ట్ లో ఉన్న ఏకైక సౌత్ ఇండియా మూవీ అదే. దీన్ని బట్టి ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మందాడి ఎంతలా అదరగొడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది.
హోమ్ ఆడియన్స్‌కు ఫేవరెట్
ఈ మండాడి సినిమా ఓటీటీలోకి వచ్చిన మొదటి నాలుగు రోజుల్లో ఎలాంటి వ్యూస్ సాధించిందో, అదే జోరును ఇప్పుడు కూడా కొనసాగిస్తుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. మల్టీపుల్ లాంగ్వేజెస్ లో రిలీజైన ఈ మూవీ.. ఓటీటీ హోమ్ ఆడియన్స్‌కు మోస్ట్ ఫేవరెట్ చాయిస్‌గా మారిపోయింది.
ఎందుకు మస్ట్ వాచ్?
మండాడి సినిమాను ఓటీటీ లవర్స్ తప్పకుండా చూడాలనేందుకు కొన్ని కారణాలున్నాయి. కమెడియన్ నుంచి హీరోగా మారిన సూరి తనదైన సహజ నటనతో మెప్పించగా, విలక్షణమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరో సుహాస్ ఈ సినిమాలో విలన్ గా అదరగొట్టారు.
{{/usCountry}}మండాడి సినిమాను ఓటీటీ లవర్స్ తప్పకుండా చూడాలనేందుకు కొన్ని కారణాలున్నాయి. కమెడియన్ నుంచి హీరోగా మారిన సూరి తనదైన సహజ నటనతో మెప్పించగా, విలక్షణమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరో సుహాస్ ఈ సినిమాలో విలన్ గా అదరగొట్టారు.
{{/usCountry}}పడవ పందేలు అనే డిఫరెంట్ స్టోరీ లైన్, సత్యరాజ్ పవర్‌ఫుల్ పాత్ర, కట్టిపడేసే కథ, ఆసక్తికరమైన కథనం కోసం ఈ మండాడి మూవీని ఓటీటీలో చూడొచ్చు.
బ్లాక్ బస్టర్
థియేటర్లలో మండాడి మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ విలక్షణమైన కథా చిత్రాన్ని దర్శకుడు మతిమారన్ పుగజేంది అద్భుతంగా తెరకెక్కించారు. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ (RS Infotainment) బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో సూరి, సుహాస్‌లతో పాటు సీనియర్ నటుడు సత్యరాజ్, మహిమ నంబియార్ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.