ఇవాళ యూట్యూబ్ లో ఓ సినిమా ట్రైలర్ రిలీజైంది. మూవీస్ ట్రైలర్ లు రిలీజ్ కావడం కామనే కదా.. ఇందులో స్పెషల్ ఏముంది అంటారా? ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా స్పెషలే. కేవలం రూ.33 వేలతో రూపొందించిన సినిమా ఇది. అవును.. ఇది నిజం. ఆ మూవీ పేరు ‘మన్ పిశాచ్’.
మన్ పిశాచ్ ట్రైలర్

హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘మన్ పిశాచ్’ మూవీ ట్రైలర్ ఇవాళ (మార్చి 14) రిలీజైంది. వణికించే సీన్లతో ఈ ట్రైలర్ భయపెడుతోంది. కేవలం రెండు క్యారెక్టర్లతోనే రూపొందించిన సినిమా ఇది. ఓ రాతి గుమ్మటం రహస్యాన్ని ఛేదించేందుకు వెళ్లే ఓ ఆర్కియాలజిస్ట్ కథతో మన్ పిశాచ్ మూవీ సాగుతుంది. ఇందులో యానియా భరద్వాజ్, దీపక్ దామ్లే నటించారు.
33 వేలే
సాధారణంగా సినిమాలు తీయాలంటే కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు అవుతుంది. ఎంత చిన్న సినిమా తీయాలన్నా కనీసం రెండు మూడు కోట్ల రూపాయలు పెట్టాల్సిందే. ఇక భారీ బడ్జెట్ సినిమాలంటే రూ.200 కోట్ల నుంచి రూ.1000 కోట్లు, ఆపైనా ఖర్చు చేస్తున్నారు. అలాంటిది కేవలం రూ.33 వేల ఖర్చుతోనే ‘మన్ పిశాచ్’ సినిమాను డైరెక్టర్ తెరకెక్కించాడు.
ఎవరీ డైరెక్టర్?
రూ.33 వేల ఖర్చుతో హారర్ థ్రిల్లర్ ‘మన్ పిశాచ్’ను రూపొందించిన డైరెక్టర్ ఎవరు? అనేది ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఆ డైరెక్టర్ సినీ లవర్స్ కు పరిచయమే. అతనే తుంబాడ్, మంఝా, మాయాసభ లాంటి హారర్ థ్రిల్లర్స్ తో ఆడియన్స్ ను భయపెట్టిన రాహి అనిల్ బార్వే. ఇప్పుడు మన్ పిశాచ్ తో అతను కొత్త ప్రయోగం చేశాడు.
ఎలా సాధ్యం?
రూ.33 వేలతోనే సినిమా తీశారంటే, అది ఎలా సాధ్యం అనే ప్రశ్న రావడం కామనే. ఇది ఎలా సాధ్యమైందో డైరెక్టర్ రాహి అనిల్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశాడు.
{{/usCountry}}రూ.33 వేలతోనే సినిమా తీశారంటే, అది ఎలా సాధ్యం అనే ప్రశ్న రావడం కామనే. ఇది ఎలా సాధ్యమైందో డైరెక్టర్ రాహి అనిల్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశాడు.
{{/usCountry}}‘‘మన్ పిశాచ్. రాహి అనిల్ బార్వే చేసిన జీరో బడ్జెట్ ప్రయోగం ఇది. ఇద్దరు యాక్టర్లు, 60 పేజీల స్క్రిప్ట్, చేతితో రాసిన స్టోరీ బోర్డులు, ఐఫోన్ రికార్డింగ్, ఫొటోషాప్, ఏఐ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తో ఇంట్లో ఉన్న కంప్యూటర్ పై 80 నిమిషాల సినిమా రూపొందింది. మొత్తం ఖర్చు రూ.33 వేలు’’ అని అనిల్ పేర్కొన్నాడు.
యూట్యూబ్ లోనే
ఐఫోన్ తో రికార్డు చేసినప్పటికీ ఏఐతో క్రియేట్ చేసిన విజువల్స్ అదిరిపోయాయనే కామెంట్లు వస్తున్నాయి. ఈ పూర్తి సినిమాను కూడా యూట్యూబ్ లోనే మార్చి 18న రిలీజ్ చేయబోతున్నారు. ఈ డైరెక్టర్ ప్రయోగానికి నెట్టింట ప్రశంసలు దక్కుతున్నాయి.