...
...
Next Story

Manchu Manoj: బాలయ్య అన్నతో క్రేజీ కాంబో.. బర్త్‌డే రోజున మంచు మనోజ్ బిగ్ అనౌన్స్‌మెంట్.. పోస్టు వైరల్

Manchu Manoj: నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్‌లో మంచు మనోజ్ భాగమయ్యాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మనోజ్ సోషల్ మీడియా షేర్ చేశాడు. ఈ పోస్టు వైరల్ గా మారింది.

Published on: May 20, 2026, 12:22:59 IST
Advertisement

Manchu Manoj: మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానులకు, తెలుగు సినీ ప్రియులకు ఒక భారీ సర్‌ప్రైజ్ లభించింది. టాలీవుడ్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక క్రేజీ కాంబినేషన్ ఎట్టకేలకు ఖరారైంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రంలో మంచు మనోజ్ ఒక కీలక పాత్రలో నటించనున్నాడు.

మంచు మనోజ్ బర్త్ డే

బాలయ్య బాబు సినిమాలో మంచు మనోజ్ (x/manoj manchu)
బాలయ్య బాబు సినిమాలో మంచు మనోజ్ (x/manoj manchu)

ఇవాళ (మే 20) మంచు మనోజ్ బర్త్ డే. ఈ సందర్భంగా తన పుట్టినరోజున ఇంతటి గొప్ప అప్‌డేట్ రావడం పట్ల మంచు మనోజ్ అమితానందాన్ని వ్యక్తం చేశాడు.

"కొన్ని పుట్టినరోజులు ఆశీర్వాదంలా వస్తాయి. ఈ పుట్టినరోజు నేను కోరుకోదగిన అత్యంత ప్రత్యేకమైన బహుమతులలో ఒకదాన్ని తెచ్చింది. మా లయన్ ఎన్‌బీకే బాలయ్య అన్న, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఎట్టకేలకు సాకారమవుతోంది" అని మంచు మనో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

మనోజ్ థ్యాంక్స్

తనపై చూపిస్తున్న ప్రేమకు, అందిస్తున్న పుట్టినరోజు శుభాకాంక్షలకు అభిమానులందరికీ ఈ సందర్భంగా మనోజ్ ధన్యవాదాలు తెలిపాడు. రాబోయే రోజుల్లో తన నుంచి రానున్న చిత్రాల లైనప్‌లో ఈ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకమైనదని మనోజ్ నొక్కి చెప్పాడు.

సాలిడ్ ట్రీట్

"ఈసారి వెండితెరపై అభిమానులందరికీ ఒక సాలిడ్ ట్రీట్ ఇవ్వబోతున్నాం. ఈ నిరీక్షణకు ఖచ్చితంగా తగిన ప్రతిఫలం లభిస్తుందని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఈ సరికొత్త ప్రయాణాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను" అని మనోజ్ అభిమానులకు ఒక బలమైన నమ్మకాన్ని ఇచ్చాడు.

వైరల్

సోషల్ మీడియాలో ఈ ప్రకటన వచ్చిన కొద్ది నిమిషాల్లోనే విపరీతంగా వైరల్ అయింది. ‘#JaiBalayya’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో నందమూరి, మంచు అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, ఇప్పుడు మంచు మనోజ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: మంచు మనోజ్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు?

సమాధానం: మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మంచు మనోజ్ నటించనున్నాడు.

ప్రశ్న: ఈ చిత్రంలో ప్రధాన హీరో ఎవరు?

సమాధానం: ఈ చిత్రంలో నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ప్రశ్న: మంచు మనోజ్ ఈ క్రేజీ అప్‌డేట్‌ను ఎప్పుడు ప్రకటించారు?

సమాధానం: మంచు మనోజ్ తన పుట్టినరోజు సందర్భంగా ఈ క్రేజీ మూవీ అప్‌డేట్‌ను అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks