థియేటర్లలో అదరగొట్టిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘మర్దానీ 3’ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ ఫ్రాంఛైజీలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచిన మర్దానీ 3 ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. మరికొన్ని గంటల్లోనే ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో రాణీ ముఖర్జీ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ సినిమా చిన్నపిల్లల కిడ్నాప్ చుట్టూ సాగుతుంది.
మర్దానీ 3 ఓటీటీ

బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ లీడ్ రోల్ ప్లే చేసిన ఫీమేల్ లీడ్ మూవీ ‘మర్దానీ 3’. ఇది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 27 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడైతే కేవలం హిందీలోనే సినిమా డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది.
అఫీషియల్
బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన ‘మర్దానీ 3’ ఓటీటీ స్ట్రీమింగ్ పై అఫీషియల్ సమాచారం వచ్చింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అప్ డేట్ ఇచ్చారు. మర్దానీ 3 సినిమా జనవరి 30, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఎనిమిది వారాలకు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తోంది.
సూపర్ హిట్
మర్దానీ 3 సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ మర్దానీ 3 మూవీకి అభిరాజ్ మినావాలా డైరెక్టర్. ఇందులో రాణీ ముఖర్జీతో పాటు జానకీ బొడివాలా, మల్లిక ప్రసాద్, జిషు సేన్ గుప్తా తదితరులు నటించారు.
మర్దానీ 3 స్టోరీ
మర్దానీ ఫ్రాంఛైజీలో తన యాక్షన్ తో రాణీ ముఖర్జీ అదరగొట్టింది. ఇప్పుడు మర్దానీ 3లోనూ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా యాక్టింగ్ ఇరగదీసింది. ఈ సినిమాలో ఆమె శివానీ శివాజీ రాయ్ ఐపీఎస్ గా తనదైన స్టైల్లో యాక్షన్ తో సత్తాచాటింది.
{{/usCountry}}మర్దానీ ఫ్రాంఛైజీలో తన యాక్షన్ తో రాణీ ముఖర్జీ అదరగొట్టింది. ఇప్పుడు మర్దానీ 3లోనూ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా యాక్టింగ్ ఇరగదీసింది. ఈ సినిమాలో ఆమె శివానీ శివాజీ రాయ్ ఐపీఎస్ గా తనదైన స్టైల్లో యాక్షన్ తో సత్తాచాటింది.
{{/usCountry}}మర్దానీ 3 సినిమాలో చిన్నపిల్లల కిడ్నాప్ ల చుట్టూ కథ సాగుతుంది. 8 నుంచి పదేళ్ల వయసున్న పిల్లలు కిడ్నాప్ అవుతుంటారు. ఏకంగా 93 మంది కనిపించకుండా పోతారు. ఈ కేసును శివానీ టేకప్ చేస్తుంది. ఈ కిడ్నాప్ ల వెనుక బిచ్చగాళ్ల మాఫియా, మెడికల్ ప్రయోగాలు ఉంటాయి. మరి ఈ కేసును శివానీ ఎలా సాల్వ్ చేసిందనేది మర్దానీ 3 సినిమాలో చూడాల్సిందే.