...
...
Next Story

కామ కోరికలతో సన్యాసిని.. లైంగిక వాంఛలతో రగిలే అమ్మాయి.. ఇవాళ రెండు ఓటీటీల్లోకి వచ్చిన తమిళ మూవీ.. ఇక్కడ చూసేయండి

డిఫరెంట్ కాన్సెప్ట్ తో థియేటర్లలో రిలీజైన తమిళ మూవీ ఒకటి నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. సన్యాసిని కామ కోరికలతో ఎలా ఇబ్బంది పడిందనే కథతో వచ్చిన ఈ మూవీ వివాదానికి కూడా కారణమైంది.

Published on: Oct 31, 2025, 18:20:03 IST
Advertisement

ఓటీటీలోకి తమిళ మూవీ ఒకటి దూసుకొచ్చింది. డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘మరియా’ సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇవాళ (అక్టోబర్ 31) రెండు ఓటీటీల్లోకి అడుగుపెట్టింది. సన్యాసినిగా ఉండే ఓ అమ్మాయి కామ కోరికలతో ఎలా ఇబ్బంది పడిందనే కథతో మరియా సినిమాను రూపొందించారు. ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ.

మరియా ఓటీటీ

ఓటీటీలోకి తమిళ సినిమా (x/SimplySouthApp)
ఓటీటీలోకి తమిళ సినిమా (x/SimplySouthApp)

కాంట్రవర్సీకి కూడా కారణమైన తమిళ సినిమా ‘మరియా’ ఓటీటీలో అడుగుపెట్టింది. శుక్రవారం రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రిలీజైంది. అక్టోబర్ 31 నుంచి సింప్లీ సౌత్ తో పాటు షార్ట్ ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సింప్లీ సౌత్ ఓటీటీలో ఇండియా బయట దేశాల్లోని ఆడియన్స్ కు అందుబాటులో ఉంది ఈ సినిమా. ఇండియాలోని ఆడియన్స్ మాత్రం షార్ట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఇప్పుడైతే తమిళంలోనే మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

నెల రోజుల్లోపే

మరియా సినిమా థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ అక్టోబర్ 3న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఓ నన్ (సన్యాసిని) లైంగిక వాంఛలతో భక్తి మార్గం వీడాలనుకోవాలనే కాన్సెప్ట్ పై విమర్శలు కూడా వచ్చాయి. ఇది వివాదానికి కారణమైంది. ఈ సినిమాకు హరి కె సుధన్ డైరెక్టర్. సాయిశ్రీ ప్రభాకరన్, అభినయ, సిద్ధు, పావెల్ తదితరులు నటించారు. ఐఎండీబీలో ఈ మూవీకి 8 రేటింగ్ ఉంది.

మరియా కథ

ఆగ్నెస్ కూడా క్రిస్టియనే. కానీ మోడర్న్ లైఫ్ గడుపుతుంది. తన లవర్ విష్ణు, మరో జంటతో కలిసి అపార్ట్ మెంట్ లో ఉంటుంది. ఆశ్రమంలో భక్తి భావంతో పెరిగిన మరియాకు ఆ అపార్ట్ మెంట్ లో విషయాలన్నీ కొత్తగా అనిపిస్తాయి. గోడ అవతల ఆగ్నెస్, విష్ణు రొమాంటిక్ ముచ్చట్లు, శృంగారం మరియాకు కోరికలు రేకెత్తిస్తాయి.

భక్తి మార్గాన్ని విడి తాను కూడా మామూలుగా జీవితాన్ని గడపాలని మరియా అనుకుంటుంది. ఆ క్రమంలోనే ఆంటన్ లవీ పరిచయమవుతాడు. అప్పుడే సాతానిజం గురించి మరియాకు చెప్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? కామ కోరికల కారణంగా మరియా ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొంది? అన్నది సినిమాలో చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks