ధమాకా సినిమాతో హిట్ పెయిర్ గా నిలిచింది రవితేజ-శ్రీలీల జోడీ. ఈ జంట మరోసారి స్క్రీన్ పై రొమాన్స్ చేసిన మూవీ ‘మాస్ జాతర’. వరుసగా ఫ్లాఫ్ సినిమాలతో సాగిపోతున్న రవితేజ మాస్ జాతరపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. రొటీన్ స్టోరీతో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది మాస్ జాతర.
మాస్ జాతర ఓటీటీ రిలీజ్ డేట్

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ మాస్ జాతర. థియేటర్లో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో ఈ వారమే స్ట్రీమింగ్ కాబోతుందని తెలిసింది. లేటెస్ట్ బజ్ ప్రకారం మాస్ జాతర ఈ నెల 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుందని టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
భారీ డిజాస్టర్
రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా వచ్చిన మాస్ జాతర.. ఆయన కెరీర్ లోనే దారుణమైన కలెక్షన్లు సాధించిన మూవీగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. అక్టోబర్ 31, 2025న మాస్ జాతర మూవీ రిలీజైంది. దీనికి భాను భోగవరపు డైరెక్టర్. ఈ మూవీని రూ.90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. చివరకు ఈ సినిమా రూ.20 కోట్లు మాత్రమే ఖాతాలో వేసుకుంది. మాస్ జాతర సినిమాను సితారా ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
మాస్ జాతర సినిమాలో రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రవీణ్, సముద్రఖని, వీటీవీ గణేష్, హైపర్ ఆది, మురళీ శర్మ తదితరులు నటించారు.
వరుస ఫ్లాప్ లు
{{/usCountry}}మాస్ జాతర సినిమాలో రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రవీణ్, సముద్రఖని, వీటీవీ గణేష్, హైపర్ ఆది, మురళీ శర్మ తదితరులు నటించారు.
వరుస ఫ్లాప్ లు
{{/usCountry}}మాస్ మహారాజ్ గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే రవితేజ కెరీర్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత రవితేజకు మరో హిట్ దక్కలేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్.. ఇలా వరుసగా ఫ్లాప్ లే ఎదురయ్యాయి. ఇప్పుడేమో మాస్ జాతర కూడా రవితేజను సక్సెస్ బాటలోకి నడిపించలేకపోయిది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని ఖాతాలో వేసుకుంది.