ఓటీటీలోకి మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతుంది. ముంబై మాఫియా, జూదం నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ పేరు 'మట్కా కింగ్'. 1960ల కాలంలో ముంబై నగరంలో ఒక సామాన్య పత్తి వ్యాపారి, తన తెలివితేటలతో దేశవ్యాప్తంగా విస్తరించిన జూదం (మట్కా) సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు అనేదే ఈ సిరీస్ ప్రధాన కథాంశం.
మట్కా కింగ్ ఓటీటీ

ఇవాళ (మార్చి 29) మట్కా కింగ్ వెబ్ సిరీస్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 17, 2026న ఇది ఓటీటీలో రిలీజ్ కానుంది.
విజయ్ వర్మ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్
'మీర్జాపూర్', 'దహాద్' వంటి సిరీస్‌లతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ వర్మ ‘మట్కా కింగ్’ సిరీస్ లో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ముంబై వీధుల్లో రాజ్యమేలిన 'మట్కా కింగ్' పాత్రలో ఆయన నటన ఎంతో సహజంగా, గంభీరంగా ఉండబోతోందని చిత్ర యూనిట్ ఇప్పటికే హింట్స్ ఇచ్చింది. టీజర్ తో మరోసారి దీనిపై క్లారిటీ వచ్చింది.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా
మట్కా కింగ్ సిరీస్ ముంబైకి చెందిన అసలైన మట్కా కింగ్ రతన్ ఖత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. 1960 నుంచి 1990 వరకు ముంబై అండర్ వరల్డ్, పోలీస్ వ్యవస్థను ప్రభావితం చేసిన మట్కా ఆటకు సంబంధించిన చీకటి కోణాలను ఇందులో చూపించబోతున్నారు.
{{/usCountry}}మట్కా కింగ్ సిరీస్ ముంబైకి చెందిన అసలైన మట్కా కింగ్ రతన్ ఖత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. 1960 నుంచి 1990 వరకు ముంబై అండర్ వరల్డ్, పోలీస్ వ్యవస్థను ప్రభావితం చేసిన మట్కా ఆటకు సంబంధించిన చీకటి కోణాలను ఇందులో చూపించబోతున్నారు.
{{/usCountry}}ప్రముఖ దర్శకుడు నాగ్ రాజ్ మంజులే ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. హానీ ట్రెహాన్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్, విజువల్స్ పరంగా 1960ల నాటి ముంబైని అద్భుతంగా రీ-క్రియేట్ చేయబోతోంది.
ఎమోషనల్ గానూ
విజయ్ వర్మతో పాటు ఈ సిరీస్‌లో సాయి తమంకర్, గుల్షన్ దేవయ్య, సిద్ధార్థ్ జాదవ్ వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముంబై మాఫియా పాలిటిక్స్ తో పాటు పర్సనల్ ఎమోషన్స్ కలయికగా ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్ట్రీమింగ్ వివరాలు
మట్కా కింగ్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 17 నుంచి ఓటీటీలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది.
వరుణ్ తేజ్ మూవీ
వరుణ్ తేజ్ 'మట్కా' సినిమా కూడా ఇదే నేపథ్యంతో వచ్చింది. దీంతో మట్కా కింగ్ సిరీస్ కు, మట్కాను కంపేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మట్కా కింగ్ అనేది వెబ్ సిరీస్ కావడంతో ఇందులో కథను మరింత లోతుగా, రాగా చూపించే అవకాశముంది.