ఓటీటీలోకి పాపులర్ రొమాంటిక్ వెబ్ సిరీస్ ‘మ్యాక్స్‌టాన్ హాల్’ సీజన్ 2 వచ్చేస్తోంది. ఫస్ట్ సీజన్ మ్యాక్స్‌టాన్ హాల్-ది వరల్డ్ బిట్వీన్ అస్ సూపర్ హిట్ గా నిలిచింది. రిలీజైన ఫస్ట్ వీక్ లో ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో నంబర్ వన్ గా ట్రెండ్ అయింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ సిరీస్ లో సీజన్ 2 రాబోతోంది.
మ్యాక్స్‌టాన్ హాల్ ఓటీటీ

పాపులర్ వెబ్ సిరీస్ మ్యాక్స్‌టాన్ హాల్ సీజన్ 2 వచ్చేస్తోంది. ఓటీటీలోకి ఇది అడుగుపెట్టబోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ అయిన మ్యాక్స్‌టాన్ హాల్ సీజన్ 2 కు సమయం ఆసన్నమవుతోంది. ఈ సీజన్ 2 నవంబర్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ జర్మన్ రొమాంటిక్ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.
నవల ఆధారంగా
మోనా కాస్టెన్ రచించిన బెస్ట్ సెల్లర్ నవల ‘సేవ్ మీ’ ఆధారంగా మ్యాక్స్‌టాన్ హాల్ ఫస్ట్ సీజన్ తెరకెక్కింది. ఇప్పుడు కూడా ఆ పాపులర్ నవల ఆధారంగా రెండో సీజన్ ను రెడీ చేశారు మేకర్స్. దీనికి మార్టిన్ షెరియర్, టెరిక్ డైరెక్టర్లు. ఫస్ట్ సీజన్ 2024, మే 9న ప్రీమియర్ అయింది. తొలి సీజన్ లో ఆరు ఎపిసోడ్లున్నాయి. సెకండ్ సీజన్ 2025, నవంబర్ 7న ఓటీటీలోకి రాబోతుంది. ఇందులోనూ 6 ఎపిసోడ్లు ఉంటాయి.
మ్యాక్స్‌టాన్ హాల్ వెబ్ సిరీస్ లో హారియట్ హెర్బిగ్, డామియన్, సొంజా, బెన్, ఫెజా తదితరులు నటించారు.
మ్యాక్స్‌టాన్ హాల్ కథ
రుబీ బెల్ అనే యువతి మ్యాక్స్‌టాన్ హాల్ యూనివర్సిటీలోకి స్కాలర్ షిప్ తో ఎంటర్ అవుతుంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివేందుకు రిఫరల్ లెటర్ కోసం ట్రై చేస్తుంది. అదే సమయంలో మ్యాక్స్‌టాన్ హాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుటన్ తో స్టూడెంట్ లిడియా ఎఫైర్ పెట్టుకుంటుంది. వాళ్లు రొమాన్స్ చేస్తుండగా రుబీ చూస్తుంది.
{{/usCountry}}రుబీ బెల్ అనే యువతి మ్యాక్స్‌టాన్ హాల్ యూనివర్సిటీలోకి స్కాలర్ షిప్ తో ఎంటర్ అవుతుంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివేందుకు రిఫరల్ లెటర్ కోసం ట్రై చేస్తుంది. అదే సమయంలో మ్యాక్స్‌టాన్ హాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుటన్ తో స్టూడెంట్ లిడియా ఎఫైర్ పెట్టుకుంటుంది. వాళ్లు రొమాన్స్ చేస్తుండగా రుబీ చూస్తుంది.
{{/usCountry}}సుటన్ తో తన ఎఫైర్ గురించి రుబీ ఎవరికీ చెప్పకుండా బెదిరించాలని తన సోదరుడు జేమ్స్ కు చెప్తుంది లిడియా. జేమ్స్ డబ్బులు ఇవ్వాలని చూసినా, బెదిరించినా రుబీ వినదు. ఆ క్రమంలో రుబీ, జేమ్స్ మధ్య లవ్ పుడుతుంది. ఇద్దరూ రొమాన్స్ చేసుకుంటారు. సెక్స్ లోనూ పాల్గొంటారు. కానీ తన కొడుకుతో రుబీ రొమాన్స్ చేస్తుండగా చూసిన జేమ్స్ తండ్రి కోప్పడతాడు. జేమ్స్ ను అక్కడి నుంచి పంపించేస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? రుబి ఆక్స్ ఫర్డ్ కు వెళ్లిందా? జేమ్స్, రుబీ కలిశారా? అన్నది రెండో సీజన్ లో చూపించనున్నారు.