...
...
Next Story

Malayalam Actor: పోక్సో కేసులో పాపులర్ మలయాళ నటుడికి జైలు శిక్ష.. చిన్నారులకు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అసభ్యంగా!

Malayalam Actor: మలయాళం సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన నటుడు శ్రీజిత్ రవికి కోర్టు షాకిచ్చింది. పోక్సో కేసులో అతణ్ని దోషిగా తేలుస్తూ ఏడాది కఠిన కారాగార శిక్షను విధించింది. ఈ పరిణామం ఇప్పుడు మల్లూవుడ్ ను ఊపేస్తోంది.

Published on: Nov 24, 2026, 10:03:12 IST
Advertisement

Malayalam Actor: మలయాళంలోనే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న శ్రీజిత్ రవికి షాక్ తగిలింది. మైనర్ పిల్లల పట్ల అతను అసభ్యకరంగా ప్రవర్తించిన ఆరోపణలతో పోక్సో కేసులో కోర్టు అతణ్ని దోషిగా తేల్చింది. ఒక ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ సోమవారం (నవంబర్ 23) కోర్టు తీర్పునిచ్చింది.

నటుడికి జైలు శిక్ష

పోక్సో కేసులో పాపులర్ మలయాళ నటుడికి జైలు శిక్ష.. చిన్నారులకు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అసభ్యంగా!
పోక్సో కేసులో పాపులర్ మలయాళ నటుడికి జైలు శిక్ష.. చిన్నారులకు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అసభ్యంగా!

శ్రీజితి రవిపై నమోదైన పోక్సో కేసును త్రిసూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించింది. ఈ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమ్య మీనన్ ఈ కేసును విచారించిన తర్వాత శ్రీజిత్ రవిని దోషిగా ప్రకటించారు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 509, పోక్సో చట్టంలోని సెక్షన్ 11(i) కింద అతను నేరం చేసినట్లు కోర్టు నిర్ధారించింది.

మరో నెల రోజులు

పోక్సో చట్టం ప్రకారం శ్రీజిత్ రవికి ఒక ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ త్రిసూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది. ఒకవేళ ఆ జరిమానా చెల్లించడంలో విఫలమైతే మరో నెల రోజుల పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

హై కోర్టులో అప్పీల్

అయితే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పుపై మలయాళ నటుడు శ్రీజిత్ రవి కేరళ హై కోర్టులో అప్పీల్ చేయనున్నాడు. ఈ విషయాన్ని శ్రీజిత్ రవి తరఫున కోర్టుకు అతని లాయర్ తెలియజేశారు. దీంతో కోర్టు అతనికి విధించిన శిక్ష అమలును నెల రోజుల పాట తాత్కాలికంగా నిలిపివేసింది.

అసలు ఏం జరిగిందంటే?

ఈ కేసు నుంచి తప్పించాలని 2022లోనే శ్రీజిత్ రవి ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే కోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది. అతను హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.

ఎవరీ శ్రీజిత్ రవి?

మలయాళ సీనియర్ నటుడు టి.జి.రవి కుమారుడే ఈ శ్రీజిత్ రవి. 2005 నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న 50 ఏళ్ల శ్రీజిత్.. మలయాళంతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించాడు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి నటుడికి ఇప్పుడు కోర్టు శిక్ష విధించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks