నాగ చైతన్య మరో భారీ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. కార్తీక్ దండు డైరెక్షన్ లో అడ్వెంచర్ మైథాలిజీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో నాగ చైతన్యతో కలిసి మీనాక్షి చౌదరి అడ్వెంచర్ చేయబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మీనాక్షి ఫస్ట్ లుక్ ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేసింది. ఈ లుక్ లో మీనాక్షి చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది.
మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్

నాగ చైతన్య- మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఎన్‌సీ 24 (వర్కింగ్ టైటిల్) నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. లుక్ ప్రకారం చూస్తే ఈ సినిమాలో మీనాక్షి పురావస్తు శాస్త్రవేత్త పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్కియాలజిస్ట్ పాత్రలో మీనాక్షి మెరవబోతోంది. దక్ష అనే క్యారెక్టర్ ప్లే చేస్తోంది.
చీకటి గుహలో
ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్లు మీనాక్షి చౌదరి లుక్ చూస్తే అర్థమవుతోంది. ఒక చీకటి గుహలో చేతిలో ఏదో పట్టుకుని పరీక్షిస్తోంది మీనాక్షి. ఏదో రహస్యాన్ని కనిపెట్టేందుకు ఆమె సీరియస్ గా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. సినిమాకు ఈ లుక్ మిస్టరీ టచ్ ఇస్తున్నట్లే కనిపిస్తోంది.
విరూపక్షతో హిట్
సాయి దుర్గా తేజ్ హీరోగా నటించిన విరూపక్షతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు కార్తీక్ దండు. ఆ హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ ను థ్రిల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగ చైతన్య మూవీతోనూ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు కార్తీక్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుకుమార్ సమర్పిస్తున్నారు. అజనీష్ బి. లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. లపాతా లేడీస్ తో పాపులర్ అయిన స్పార్ష్ శ్రీవాస్తవ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
డిఫరెంట్ రోల్
{{/usCountry}}సాయి దుర్గా తేజ్ హీరోగా నటించిన విరూపక్షతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు కార్తీక్ దండు. ఆ హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ ను థ్రిల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగ చైతన్య మూవీతోనూ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు కార్తీక్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుకుమార్ సమర్పిస్తున్నారు. అజనీష్ బి. లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. లపాతా లేడీస్ తో పాపులర్ అయిన స్పార్ష్ శ్రీవాస్తవ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
డిఫరెంట్ రోల్
{{/usCountry}}వరుసగా అదిరిపోయే సినిమాలతో సాగిపోతోంది మీనాక్షి చౌదరి. లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల్లో నటనతో ఆకట్టుకుంది. మరోవైపు నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు మూవీ కంప్లీట్ చేస్తోంది. ఇప్పుడు ఎన్‌సీ 24లో నాగ చైతన్య సరసన డిఫరెంట్ రోల్ ప్లే చేస్తోంది మీనాక్షి చౌదరి. ఈ మూవీతో ఆమె కెరీర్ మరో స్థాయికి చేరే అవకాశముంది.