...
...
Next Story

Meenakshi Seshadri: ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. సినిమా లేదా ఓటీటీ ఏదైనా సరే.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చాను: మీనాక్షి

Meenakshi Seshadri: 1980, 90ల నాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి దాదాపు 30 ఏళ్ల తర్వాత తిరిగి ఇండియాకు (ముంబై) చేరుకున్నారు. సినిమా లేదా ఓటీటీ ప్రాజెక్ట్‌లతో ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మంచి అవకాశాల కోసం చూస్తున్నానని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Published on: May 25, 2026, 15:01:02 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Meenakshi Seshadri: ఒకప్పుడు తన అద్భుత నటనతో వెండితెరను ఏలిన సీనియర్ నటి మీనాక్షి శేషాద్రి (Meenakshi Seshadri) మళ్లీ కెమెరా ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని చిత్ర పరిశ్రమకు దూరమైన ఆమె.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తిరిగి తన 'కర్మభూమి' అయిన ముంబైకి చేరుకున్నారు.

Meenakshi Seshadri: ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. సినిమా లేదా ఓటీటీ ఏదైనా సరే.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చాను: మీనాక్షి
Meenakshi Seshadri: ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. సినిమా లేదా ఓటీటీ ఏదైనా సరే.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చాను: మీనాక్షి

ఈ విషయాన్ని ఆమె స్వయంగా అభిమానులతో పంచుకుంటూ, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు.

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా భావోద్వేగ వీడియో

చిరంజీవితో కలిసి తెలుగులో ఆపద్బాంధవుడు మూవీ చేసిన మీనాక్షి శేషాద్రి గుర్తుందా? ఆమె మళ్లీ ఇండియాకు వచ్చేశారు. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌లో తన కుమారుడి హార్వర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొంటున్న మీనాక్షి.. అక్కడ నుంచే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేశారు.

"నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ నమస్కారం. మీ ప్రేమ, నిరంతర మద్దతుకు ధన్యవాదాలు. 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నేను మళ్లీ నా కర్మభూమి అయిన ముంబైకి తిరిగి వచ్చాను. ఎంతో నమ్మకం, ఉత్సాహం, పాజిటివిటీతో ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలోకి మళ్లీ అడుగుపెడుతున్నాను" అని మీనాక్షి పేర్కొన్నారు.

ఎలాంటి పాత్రలకైనా సిద్ధం.. కానీ ఇంపాక్ట్ ఉండాలి

తన రీ-ఎంట్రీ గురించి మీనాక్షి మాట్లాడుతూ, తనకు కేవలం ప్రధాన పాత్రలే చేయాలని లేదని స్పష్టం చేశారు. అది లీడ్ రోల్ అయినా, సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా లేదా చిన్న వెబ్ సిరీస్ అయినా తనకు ఓకే అని చెప్పారు.

ఇప్పుడు తాను ఏదో నిరూపించుకోవాలని రాలేదని, తనకు ఎంతో ఇష్టమైన యాక్టింగ్ కెరీర్ కొనసాగించడానికే తన ఫ్యామిలీ సపోర్ట్ తో వచ్చినట్లు చెప్పారు. ఎలాంటి పీఆర్ ఏజెన్సీ లేదా మేనేజర్‌ సాయం లేకుండా స్వయంగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రయాణాన్ని మేనేజ్ చేసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.

మీనాక్షి శేషాద్రి సినీ ప్రస్థానం

1983లో 'పెయింటర్ బాబు' చిత్రంతో మీనాక్షి శేషాద్రి బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో జాకీ ష్రాఫ్‌ సరసన నటించిన 'హీరో' (Hero) సినిమా ఆమెను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసింది. ఆ తర్వాత దామిని, ఘాయల్, షహన్‌షా, మేరీ జంగ్, ఘాతక్ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి 1980, 1990వ దశకంలో అగ్ర కథానాయికగా రాణించారు.

ముఖ్యంగా 1993లో వచ్చిన 'దామిని' సినిమాలో న్యాయం కోసం పోరాడే మహిళగా ఆమె చేసిన నటన భారతీయ సినిమా చరిత్రలోనే నిలిచిపోయింది. కెరీర్ అత్యున్నత శిఖరాల్లో ఉన్న సమయంలోనే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ హరీష్ మైసూర్‌ను వివాహం చేసుకుని ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నారనే వార్త వినగానే పాత తరం సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్ కుమార్ వంటి స్టార్లతో సినిమా చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. మీనాక్షి శేషాద్రి ఇండస్ట్రీకి ఎందుకు దూరమయ్యారు?

1990ల కాలంలో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్న సమయంలో ఆమె ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ హరీష్ మైసూర్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి అమెరికాలో స్థిరపడ్డారు.

2. మీనాక్షి ఎలాంటి పాత్రలతో రీ-ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు?

తనను ఒక నటిగా ఛాలెంజ్ చేసే ఎలాంటి పాత్రలైనా చేయడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. అది హీరోయిన్ పాత్ర కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు లేదా ఓటీటీ షోలు కావచ్చు, కానీ పాత్రలో బలం ఉండాలని ఆమె కోరుకుంటున్నారు.

3. మీనాక్షి శేషాద్రి నటించిన కొన్ని ఐకానిక్ సినిమాలు ఏవి?

ఆమె నటించిన చిత్రాలలో 'హీరో', 'దామిని', 'ఘాయల్', 'ఘాతక్', 'షహన్‌షా' వంటి సినిమాలు బాలీవుడ్‌లో క్లాసిక్స్‌గా నిలిచాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe