Sathi Leelavathi: పెద్ది పోస్ట్‌పోన్-బాక్సాఫీస్ రేసులో మెగా కోడలి సినిమా- లావణ్య త్రిపాఠి సతీ లీలావతి కొత్త రిలీజ్ డేట్
Sathi Leelavathi: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. అయితే మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇప్పుడు బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అయింది. ఆమె మూవీ సతీ లీలావతి కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇవాళ ప్రకటించారు.
Sathi Leelavathi: ఎట్టకేలకు సమ్మర్ లో మెగా ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఆ ఇంటి నుంచి ఓ మూవీ వచ్చేస్తోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది రిలీజ్ పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ సినిమా బాక్సాఫీస్ రేసులో దిగనుంది.

సతీ లీలావతి రిలీజ్ డేట్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని మెగా ఇంటి కోడలిగా మారిన తర్వాత లావణ్య త్రిపాఠి చేసిన ఫస్ట్ తెలుగు మూవీ ‘సతీ లీలావతి’. ఈ చిత్రం థియేటర్లకు రాబోతుంది. ఒకట్రెండు సార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు కొత్త విడుదల తేదీని ప్రకటించింది. మే 8, 2026న సతీ లీలావతి రిలీజ్ కానుంది.
‘‘కొత్త డేట్. అదే ఎగ్జైట్మెంట్. మే 8న థియేటర్లలో సతీ లీలావతిని చూడండి. బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ కు రెడీ అవండి’’ అని సోషల్ మీడియాలో రిలీజ్ పోస్టర్ ను లావణ్య త్రిపాఠి పోస్టు చేసింది.
సినిమా గురించి
సతీ లీలావతి సినిమాలో దేవ్ మోహన్, లావణ్య త్రిపాఠి కొణిదెల జంటగా నటించారు. ఈ చిత్రానికి తాతినేని సత్య డైరెక్టర్. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ (శివ మనసులో శ్రుతి) అనే సినిమాలకు తాతినేని సత్య దర్శకత్వం వహించాడు. సతీ లీలావతి మూవీని దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ పై నాగ మోహన్ నిర్మించారు. ఈ సినిమాను మార్చి 6న రిలీజ్ చేాయాలనుకుని ఆగిపోయారు.
భార్యభర్తల అనుబంధం
విభిన్న కుటుంబాలు, వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు పెళ్లితో ముడిపడతారు. భార్యాభర్తలుగా మారిన ఆ జంట జీవితం ఎలా సాగింది? వాళ్ల మధ్య అనుబంధం ఎలా ఉండాలి? అని చెప్పే సినిమానే సతీ లీలావతి అని తెలుస్తోంది. హస్పెండ్, వైఫ్ మధ్య ఉండే రిలేషన్ ను ఎమోషనల్ గానే కాకుండా ఎంటర్ టైనింగ్ గానూ ఈ మూవీలో చూపిస్తారని సమాచారం.
పెద్ది పోస్ట్ పోన్
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ రిలీజ్ పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ జూన్ కు వాయిదా పడింది. ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన డైరెక్టర్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని జూన్ 25న రిలీజ్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


