...
...
Next Story

Mega Family: ఫ్యాన్స్ టెన్షన్.. చిరంజీవి నుంచి పవన్ వరకు.. 2026 కలిసి రావడం లేదా? నలుగురు మెగా హీరోలు హాస్పిటల్ లో!

Mega Family: మెగా ఫ్యామిలీకి ఏమైంది? ఒకరి తర్వాత ఒకరికి సర్జరీలు ఎందుకు అవుతున్నాయి?.. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. 2026లోనే చిరంజీవి నుంచి పవన్ కల్యాణ్ వరకు చూసుకుంటే ఈ ఫ్యామిలీలో మొత్తం నలుగురు హీరోలు ట్రీట్మెంట్ తీసుకున్నారు.

Published on: Apr 19, 2026, 20:11:37 IST
Advertisement

Mega Family: మెగా ఫ్యామిలీలో వరుస సర్జరీలు చోటు చేసుకోవడం ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. చిరంజీవి కుటుంబానికి 2026 లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చిరంజీవి నుంచి పవన్ కల్యాణ్ వరకు మెగా ఫ్యామిలీలో నలుగురికి గాయాలు కావడమో, ఆరోగ్యం బాగోలేకపోవడమో జరిగింది.

చిరంజీవి భుజానికి

చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, పవన్ కల్యాణ్ (x)
చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, పవన్ కల్యాణ్ (x)

2026ను చిరంజీవి గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. మెగాస్టార్ హీరోగా నటించిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ ఈ మూవీ రిలీజ్ తర్వాత కొన్ని రోజులకు చిరంజీవి చేతికి కట్టుతో కనిపించారు. ఫిబ్రవరిలో ఆయన భుజానికి సర్జరీ అయింది. దాని నుంచి మెగాస్టార్ కోలుకున్నారు.

రామ్ చరణ్ కు గాయం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. నిజానికి ఈ మూవీ ఏప్రిల్ 30 న రిలీజ్ కావాల్సి ఉండగా.. జూన్ కు వాయిదా పడింది. ఈ సినిమాలో గ్రామీణ క్రీడాకారుడిగా చరణ్ కనిపించనున్నాడు. పెద్ది మూవీ షూటింగ్ లోనే రామ్ చరణ్ కంటిపైన గాయమైంది. దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత చరణ్ మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నాడు.

వరుణ్ తేజ్

మరో మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కు కూడా రీసెంట్ గా గాయమైంది. చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు కొడుకైన వరుణ్ తేజ్ కు మోకాలి సర్జరీ జరిగింది. ప్రస్తుతం చెల్లి నిహారిక కొణిదెల నిర్మాణంలో వరుణ్ బరి అనే సినిమా చేస్తున్నాడు. ఇది వాలీబాల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ మోకాలికి తీవ్ర గాయమైంది.

పవన్ కల్యాణ్ కు సర్జరీ

ఇలా 2026లో ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి నలుగురు హీరోలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి రావడం గమనార్హం. దీని పట్ల మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోలకు భవిష్యత్ లో ఈ గాయాల బెడద ఉండకూడదని కోరుకుంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks