బాక్సాఫీస్ కింగ్ గా, మెగాస్టార్ గా కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు అంటూ థియేటర్లో సందడి చేయడానికి వస్తున్నారు. చిరుకు సంక్రాంతి అంటే సెంటిమెంట్. మరి ఆయన కెరీర్ ఏ సినిమాలు సంక్రాంతికి వచ్చాయో, వాటి రిజల్ట్ ఏంటో ఇక్కడ చూసేద్దాం.
మన శంకర వరప్రసాద్ గారు

సంక్రాంతి 2026కు మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు చిరంజీవి రెడీ అయ్యారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది. ఇందులో నయనతార హీరోయిన్. ట్రైలర్ చూస్తే సంక్రాంతికి చిరు ఖాతాలో మరో హిట్ పడటం గ్యారెంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
రీ ఎంట్రీ సంక్రాంతికే
మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి సినీ కెరీర్ కు గ్యాప్ ఇచ్చారు. కొంత కాలం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ రీ ఎంట్రీ మూవీ కూడా సంక్రాంతికే రిలీజైంది. ఖైదీ నంబర్ 150 సినిమాతో మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ఈ చిత్రం 2017 సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాస్ కు మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. 2023 సంక్రాంతికి కూడా వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్నారు చిరు.
సంక్రాంతికి వరుసగా మూడేళ్లు
ఒక్క సంక్రాంతికి కాదు వరుసగా మూడేళ్ల పాటు సంక్రాంతికి బాక్సాఫీస్ కింగ్ గా నిలిచారు చిరంజీవి. 1987లో దొంగ మొగుడు, 1988లో మంచి దొంగ, 1989లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలతో సంచలనం క్రియేట్ చేశారు చిరు. ఈ మూడు సినిమాలు కూడా సంక్రాంతికే రిలీజై బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అంతకుముందు 1985లో వచ్చిన చట్టంతో పోరాటం మూవీ చిరుకు తొలి సంక్రాంతి సినిమా.
ఈ హిట్లు కూడా
{{/usCountry}}ఒక్క సంక్రాంతికి కాదు వరుసగా మూడేళ్ల పాటు సంక్రాంతికి బాక్సాఫీస్ కింగ్ గా నిలిచారు చిరంజీవి. 1987లో దొంగ మొగుడు, 1988లో మంచి దొంగ, 1989లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలతో సంచలనం క్రియేట్ చేశారు చిరు. ఈ మూడు సినిమాలు కూడా సంక్రాంతికే రిలీజై బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అంతకుముందు 1985లో వచ్చిన చట్టంతో పోరాటం మూవీ చిరుకు తొలి సంక్రాంతి సినిమా.
ఈ హిట్లు కూడా
{{/usCountry}}1993లో ముఠా మేస్త్రి, 1997లో హిట్లర్, 1999లో స్నేహం కోసం, 2000లో అన్నయ్య, 2001లో మృగరాజు, 2004లో అంజి సినిమాలను సంక్రాంతికే రిలీజ్ చేశారు మెగాస్టార్. ఇందులో మృగరాజు ఒక్కటే ఫ్లాప్. ఇక అంజి ఏమో యావరేజ్ గా నడిచింది కానీ గ్రాఫిక్స్ కు ఈ మూవీ ప్రశంసలు అందుకుంది. చిరు కెరీర్ లో సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మృగరాజు, అంజి మినహా అన్ని చిత్రాలు అదరగొట్టాయి. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారుతో మరోసారి పండగకు మ్యాజిక్ చేయనున్నారు చిరు.