Chiranjeevi Review: ఇలాంటి సినిమాలు కావాలి.. చిరంజీవి మా ఇంటి బంగారం రివ్యూ.. సమంత ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసిన మెగాస్టార్

Chiranjeevi Review: బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్న మా ఇంటి బంగారం మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించేశారు. ఇలాంటి సినిమాలు కావాలంటూ తన స్టైల్లో రివ్యూ ఇచ్చేశారు. అలాగే తన పోస్ట్ తో హీరోయిన్ సమంత ప్రెగ్నెన్సీని కూడా మెగాస్టార్ కన్ఫామ్ చేసేశారు. చిరు ఏమన్నారో ఇక్కడ చదివేయండి.

Published on: Jun 23, 2026, 10:44:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chiranjeevi Review: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్న ‘మా ఇంటి బంగారం’ మూవీ చూసి మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. ఈ సినిమాపై ప్రశంసలు కురిపించేశారు. హీరోయిన్ సమంతతో సహా ఈ మూవీ టీమ్ ను తన ఇంటికి పిలిపించి మరీ చిరు అభినందించారు. ఈ సందర్బంగా సామ్ ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా తన పోస్ట్ ద్వారా మెగాస్టార్ కన్ఫామ్ చేయడం విశేషం.

ఇలాంటి సినిమాలు కావాలి.. చిరంజీవి మా ఇంటి బంగారం రివ్యూ (x/KChiruTweets)
ఇలాంటి సినిమాలు కావాలి.. చిరంజీవి మా ఇంటి బంగారం రివ్యూ (x/KChiruTweets)

చిరంజీవి రివ్యూ

సమంత లీడ్ రోల్ ప్లే చేసిన మా ఇంటి బంగారం మూవీపై చిరంజీవి రివ్యూ వైరల్ గా మారింది. ఈ మూవీ టీమ్ ను సోమవారం (జూన్ 23) రాత్రి కలిసిన చిరంజీవి అనంతరం తన ఎక్స్ అకౌంట్లో సినిమా గురించి పేర్కొన్నారు.

‘‘‘మా ఇంటి బంగారం’ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు’’ అని చిరంజీవి రాసుకొచ్చారు.

సామ్ యాక్షన్ సీన్లు

‘‘సమంత రూత్ ప్రభు నటన, ముఖ్యంగా చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇలాంటి వైవిధ్యమైన, మహిళా ప్రాధాన్య చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు అవసరం. ఈ విజయానికి సమంత, నందిని రెడ్డి, రాజ్, మొత్తం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు’’ అని మెగాస్టార్ తన రివ్యూ పోస్టు చేశారు.

ప్రెగ్నెన్సీ కన్ఫామ్

రీసెంట్ గా సమంత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ ఈవెంట్లో సమంత బేబీ బంప్ తో కనిపించడమే ఇందుకు కారణం. కానీ దీనిపై ఇప్పటివరకూ సామ్ అఫీషియల్ గా రియాక్టవలేదు. అయితే చిరంజీవి తన తాజా పోస్టుతో ఈ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందనే టాక్ వినిపిస్తోంది.

‘‘జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత & రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు’’ అని చిరంజీవి తన పోస్టులో లాస్ట్ లో రాశారు. అంటే దీని అర్థం ఈ సామ్, రాజ్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మా ఇంటి బంగారం గురించి

సమంత మూడేళ్ల తర్వాత తెలుగులో లీడ్ రోల్ ప్లే చేసిన మూవీ ‘మా ఇంటి బంగారం’. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా ఈ సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More