Heroine: పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్- వెడ్డింగ్ తర్వాత ఆరు నెలలకే డెలివరీ-హీరోయిన్ చెప్పిన షాకింగ్ విషయాలు

Heroine: పెళ్లి కాకుండానే తల్లి అయితే తప్పేంటని రీసెంట్ గా నిత్యా మీనన్ ప్రశ్నించింది?  దీంతో వివాహం చేసుకోకుండా పిల్లలను కంటారా అనే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకుని, హడావిడిగా వెడ్డింగ్ చేసుకున్న ఓ హీరోయిన్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

Published on: Apr 30, 2026, 13:50:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Heroine: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ, వివాహం కాకుండానే పిల్లలను కనడం.. ఇదే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కంటే తప్పేంటని నిత్యా మీనన్ ప్రశ్నించడంతో ఈ అంశంపై రచ్చ మొదలైంది. అయితే చాలా మంది హీరోయిన్లు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యారు. వీళ్లలో బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియా కూడా ఒకరు.

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ గా హీరోయిన్ (instagram)
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ గా హీరోయిన్ (instagram)

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్

బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియా పెళ్లి కంటే ముందే ప్రెగ్నెంట్ అయింది. ఈ విషయాన్ని ఆమెనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రెగ్నెంట్ అని తెలియడంతోనే హడావుడిగా పెళ్లి చేసుకున్నట్లు ఆమె పేర్కొంది. వెడ్డింగ్ అయిన ఆరు నెలలకే నేహా ధూపియా బిడ్డకు జన్మనిచ్చింది.

అంగద్ బేడీతో

నేహా ధూపియా, అంగద్ బేడీ మధ్య పెళ్లికి ముందే రిలేషన్ షిప్ నడిచింది. ఈ జంట డేటింగ్ లో ఉన్నప్పుడే కమిట్ అయిపోయారు. దీంతో నేహా ధూపియా గర్భం దాల్చింది. ఆ తర్వాత వీళ్లు 2018, మే 10న గురుద్వారాలో పెళ్లి చేసుకున్నారు. తాను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అనే విషయం ఇంట్లో వాళ్లకు తెలిసిందని, దీంతో హడావుడిగా అంగద్ ను పెళ్లి చేసుకున్నానని నేహా ధూపియా చెప్పుకొచ్చింది. ప్రెగ్నెన్సీ విషయం తెలిసిన 72 గంటల్లోనే వీళ్ల వెడ్డింగ్ జరిగిపోయిందంటా.

నేహా ధూపియా గురించి

బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా తెలుగులోనూ సినిమాలు చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నేహా.. జపనీస్ లోనూ ఓ మూవీ చేసింది. 2003లో తరుణ్ హీరోగా వచ్చిన ‘నిన్నే ఇష్టపడ్డాను’ మూవీలో నేహా ఓ సాంగ్ చేసింది. ఆ తర్వాత ‘ఖయామత్: సిటీ అండర్ థ్రెట్’ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ చేసింది.

రాజశేఖర్ హీరోగా నటించిన ‘విలన్’, నందమూరి బాల‌కృష్ణ‌ ‘పరమ వీర చక్ర’ సినిమాల్లో నేహా ధూపియా హీరోయిన్ గా నటించింది. హిందీలో చాలా మూవీస్ లో యాక్ట్ చేసింది. ఓటీటీ ఒరిజినల్స్ లోనూ మెరిసింది.

వీళ్లు కూడా

నేహా ధూపియానే కాకుండా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు ఇంకా వేరే వాళ్లు కూడా ఉన్నారు. లేెటెస్ట్ గా అలియా భట్ ఇలాగే పెళ్లికి ముందు గర్భం దాల్చిందని అంటారు. ఆ వెంటనే రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుందని టాక్. ఇక నీనా గుప్తా, సారిక, మహిమ చౌదరి, కొంకణ సేన్ శర్మ, దియా మీర్జా కూడా ఇలాగే పెళ్లికి ముందే నెల తప్పారని సమాచారం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More