...
...
Next Story

Chiranjeevi Netflix: ఇది నా అడ్డా.. నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి మెగావర్స్ టీజర్.. ‘ఎన్’ అక్షరం మాయం వెనుక సీక్రెట్ ఇదే

Chiranjeevi Netflix: చిరంజీవి డిజిటల్ రంగంలోకి సరికొత్త అవతారంలో అడుగుపెడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆయన 'చిరంజీవిస్ మెగావర్స్' అనే సెలబ్రిటీ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. గత కొన్ని రోజులుగా 'CHIRA_JEEVI' అంటూ 'N' అక్షరం మిస్ అయిన హోర్డింగ్స్‌తో క్రియేట్ అయిన సస్పెన్స్ కు తెరపడింది.

Published on: Nov 24, 2026, 12:18:21 IST
Advertisement

Chiranjeevi Netflix: వెండితెరపై సుమారు ఐదు దశాబ్దాలుగా తన నటన, డ్యాన్సులు, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో కోట్లాది మంది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఓటీటీ ప్రపంచాన్ని శాసించేందుకు సిద్ధమయ్యారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆయన మొట్టమొదటిసారిగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘చిరంజీవిస్ మెగావర్స్’పై నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ మంగళవారం (నవంబర్ 24) క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది.

Chiranjeevi Netflix: ఇది నా అడ్డా.. నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి మెగావర్స్ టీజర్.. ‘ఎన్’ అక్షరం మాయం వెనుక సీక్రెట్ ఇదే
Chiranjeevi Netflix: ఇది నా అడ్డా.. నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి మెగావర్స్ టీజర్.. ‘ఎన్’ అక్షరం మాయం వెనుక సీక్రెట్ ఇదే

చిరంజీవి ఇంగ్లిష్ అక్షరాల్లో మిస్ అయిన ఎన్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తేలిపోయింది. నవంబర్ 30న హైదరాబాద్‌లో ఈ షో గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుండగా, ఇందులో కమల్ హాసన్, నాగార్జున, ప్రభాస్, రవితేజ, నాని, బ్రహ్మానందం వంటి దిగ్గజ సెలబ్రిటీలు అతిథులుగా సందడి చేయనున్నారు.

'N' మిస్సింగ్ హోర్డింగ్స్ వెనుక అసలు ట్విస్ట్ రివీల్

గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లలో ‘CHIRA_JEEVI’ అంటూ మధ్యలో 'N' అక్షరం లేకుండా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్స్ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీశాయి. ఆ మిస్ అయిన 'N' అక్షరం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లోగో అని అభిమానులు ఊహించినట్లే, తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.

“‘N’ వచ్చేసింది… MEGA కొలాబరేషన్ కుదిరేసింది! మెగా నోస్టాల్జియా, మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు.. అన్నీ ఒకే చోట! నెట్‌ఫ్లిక్స్ యూనివర్స్‌లోకి మెగాస్టార్ అడుగుపెడుతున్నారు. 'చిరంజీవిస్ మెగావర్స్' త్వరలోనే కేవలం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది” అంటూ నెట్‌ఫ్లిక్స్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

గతంలో బుల్లితెరపై 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోతో ఆకట్టుకున్న చిరంజీవి, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి ప్రొడక్షన్ విలువలతో కూడిన ఈ టాక్ షో ద్వారా తన సినీ ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలను, తెరవెనుక ఆసక్తికర విశేషాలను ప్రేక్షకులతో పంచుకోనున్నారు.

గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (సుస్మిత కొణిదెల), ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా ఈ షోను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ కూడా పూర్తయింది.

ఈ షోలో భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు పాల్గొననున్నట్లు సినీ వర్గాల సమాచారం. లోకనాయకుడు కమల్ హాసన్, కింగ్ నాగార్జున, రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, దర్శకులు సందీప్ రెడ్డి వంగా, బాబీ కొల్లి తదితరులు చిరంజీవితో కలిసి సరదా ముచ్చట్లు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

నవంబర్ 30న హైదరాబాద్‌లో గ్రాండ్ లాంచ్ ఈవెంట్!

'చిరంజీవిస్ మెగావర్స్' షో ప్రారంభోత్సవాన్ని నవంబర్ 30, 2026న సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నెట్‌ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, మెగా అభిమానులు హాజరుకానున్నారు.

అదే రోజున ఈ షో అధికారిక ప్రోమోతో పాటు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు సినిమాల విషయానికొస్తే, చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' (Vishwambhara), బాబీ కొల్లి దర్శకత్వంలో 'కాకా' (Kaaka) చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

 

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks