Chiru leaks: మళ్లీ చిరు లీక్స్.. వద్దు వద్దు అనుకుంటూనే కాకాలో అనస్వర క్యారెక్టర్ గురించి చెప్పేసిన చిరంజీవి

Chiru leaks Anaswara Rajan: మెగాస్టార్ చిరంజీవి ఏదైనా మూవీ ఈవెంట్ కు అటెండ్ అయితే తన సినిమాల గురించి ఏం లీక్ చేస్తారా అని చూడటం అలవాటుగా మారింది. చిరు కూడా ‘చిరు లీక్స్’ పేరుతో తన సినిమాల విషయాలు బయటపెడుతుంటారు. తాజాగా కాకా సినిమాలో అనస్వర రాజన్ క్యారెక్టర్ గురించి చిరు లీక్ చేసేశారు. 

Published on: Nov 18, 2026, 05:59:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Chiru leaks Anaswara Rajan: మెగాస్టార్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘కాకా’. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో మలయాళ కుట్టీ అనస్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా అనస్వర రాజన్ క్యారెక్టర్ ను చిరు లీక్ చేశారు.

మళ్లీ చిరు లీక్స్.. వద్దు వద్దు అనుకుంటూనే కాకాలో అనస్వర క్యారెక్టర్ గురించి చెప్పేసిన చిరంజీవి
మళ్లీ చిరు లీక్స్.. వద్దు వద్దు అనుకుంటూనే కాకాలో అనస్వర క్యారెక్టర్ గురించి చెప్పేసిన చిరంజీవి

అమ్ములు పాప

కాకా సినిమాలో అనస్వర రాజన్ అమ్ములు పాప క్యారెక్టర్ ప్లే చేస్తోంది. ఇప్పటికే ఈ క్యారెక్టర్ సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరంజీవి కూతురిగా అనస్వర నటిస్తుంది. దీంతో చిరంజీవి, అనస్వర మధ్య సీన్లు ఎలా ఉంటాయి? వీళ్ల ఎమోషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

చిరు లీక్

అనస్వర రాజన్, అనీష్ జంటగా నటించిన ఇట్లు అర్జున సినిమా ఇటీవల రిలీజైంది. ఈ మూవీ సక్సెస్ మీట్ ను మంగళవారం (నవంబర్ 17) రాత్రి నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కు చీఫ్ గెస్ట్ గా వెళ్లిన చిరంజీవి మరోసారి చిరు లీక్స్ తో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

మాటలు రావు

కాకా మూవీ నుంచి ఏ విషయం లీక్ చేయొద్దని, వద్దు వద్దు అనుకుంటూనే అనస్వర రాజన్ క్యారెక్టర్ గురించి చిరు హింట్ ఇచ్చారు. అక్కడే ఉన్న యాంకర్ స్రవంతిని ఉద్దేశిస్తూ.. ‘‘నువ్వు ఏం అడగొద్దు అమ్మాయి. ఏం లీక్ చేస్తానోనని టెన్షన్ గా ఉంది. వద్దు వద్దు నువ్వు కాస్త దూరంగా ఉండు’’ అని చిరు అన్నారు.

‘‘అనస్వర నువ్వేమైనా మాట్లాడాలనుకుంటున్నావా? ఆమె మాట్లాడలేదు. ఆమె మాట్లాడాలనుకోవడం లేదు. మీరు ఇంటికి వెళ్లాక ఈ వీడియోను మళ్లీ చూడండి. అప్పుడు నేను చెప్పింది అర్థమవుతుంది’’ అని చిరంజీవి నవ్వేశారు. దీంతో లీక్ చేసేశారన్నట్లు అనస్వర రాజన్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.

సినిమాలో మూగమ్మాయిగా

చిరంజీవి మాటలను బట్టి చూస్తే కాకా సినిమాలో అనస్వర రాజన్ మూగమ్మాయిగా నటిస్తుందని అర్థమవుతుంది. నెటిజన్లు కూడా ఇదే విషయంపై డిస్కషన్ స్టార్ట్ చేశారు. అయితే రీసెంట్ గా వచ్చిన ఇట్లు అర్జున సినిమాలో హీరో మూగవాడిగా నటించిన సంగతి తెలిసిందే.

ఇక బాబీ కొల్లి, చిరు కాంబినేషన్లో వస్తున్న కాకాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం జనవరి 13న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో మెగాస్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న లుక్స్ లో కనిపిస్తారని టాక్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More