...
...
Next Story

CM Sangma: తెలుగు క్రైమ్ కామెడీ సినిమా బా బా బ్లాక్ షీప్‌పై మేఘాలయ సీఎం సంగ్మా ప్రశంసలు- రాష్ట్రానికి ఎంతో గర్వకారణమంటూ!

Meghalaya CM Sangma Praised Baa Baa Black Sheep Movie: పూర్తిగా మేఘాలయ అందాల నేపథ్యంలో తెరకెక్కిన తొలి దక్షణాది చిత్రం 'బా బా బ్లాక్ షీప్' అక్టోబర్ 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Published on: Oct 8, 2026, 18:39:19 IST
Advertisement

Meghalaya CM Sangma Praised Baa Baa Black Sheep Movie: టాలీవుడ్‌లో వినూత్న కథాంశాలకు, కొత్త లోకేషన్లలో చిత్రీకరణలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. అదే బాటలో ఈశాన్య భారత ప్రాకృతిక సౌందర్యాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ రూపొందిన సరికొత్త క్రైమ్ కామెడీ చిత్రం 'బా బా బ్లాక్ షీప్'.

మేఘాలయ రాష్ట్రంలోనే చిత్రీకరించిన

తెలుగు క్రైమ్ కామెడీ సినిమా బా బా బ్లాక్ షీప్‌పై మేఘాలయ సీఎం సంగ్మా ప్రశంసలు- రాష్ట్రానికి ఎంతో గర్వకారణమంటూ!
తెలుగు క్రైమ్ కామెడీ సినిమా బా బా బ్లాక్ షీప్‌పై మేఘాలయ సీఎం సంగ్మా ప్రశంసలు- రాష్ట్రానికి ఎంతో గర్వకారణమంటూ!

పూర్తిగా మేఘాలయ రాష్ట్రంలోనే చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రంగా బా బా బ్లాక్ షీప్ సినిమా సినీ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. గుణి మంచికంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది.

ఇప్పటికే విడుదలైన బా బా బ్లాక్ షీప్ టీజర్, ట్రైలర్, రెండు పాటలు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇలా ఈ సినిమాపై అంచనాలు పెరిగిన తరుణంలో తాజాగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా బా బా బ్లాక్ షీప్ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

ఈశాన్య సౌందర్యం వెండితెరపై.. సీఎం కాన్రాడ్ సంగ్మా ఆనందం

"ఇది మా రాష్ట్రానికి ఎంతో గర్వకారణమైన క్షణం. మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన మొదటి దక్షణాది చిత్రం ఇదే. మన కొండలు, మంచు తెరలు, మనోహరమైన జలపాతాలు, సజీవ వేర్ల వంతెనల (Living Root Bridges) ప్రకృతి అందాలను ప్రపంచానికి చూపించేందుకు ఈ సినిమా ఒక చక్కని వేదికగా నిలిచింది" అని సీఎం కాన్రాడ్ సంగ్మా వ్యాఖ్యానించారు.

స్థానిక యువతకు లభించే అవకాశాలు

బా బా బ్లాక్ షీప్ సినిమా ద్వారా స్థానిక యువతకు లభించే అవకాశాలను సైతం సీఎం కాన్రాడ్ సంగ్మా ప్రస్తావించారు. నిర్మాత వేణు దోనేపూడితో పాటు చిత్రాలయం స్టూడియోస్, సాంకేతిక నిపుణులను అభినందించారు.

"మా ప్రాంతంలో సినిమా నిర్మాణాలు జరగడం వల్ల స్థానిక యువతకు ఉపాధి లభించడమే కాకుండా, వారు సినీ రంగంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి మంచి అవకాశం దక్కుతుంది. భవిష్యత్తులో మరిన్ని సినీ బృందాలు మేఘాలయకు వచ్చి చిత్రీకరణలు జరపాలని ఆకాంక్షిస్తున్నాను" అని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా పేర్కొన్నారు.

అక్టోబర్ 9న థియేటర్లలో నవ్వుల విందు!

ఇదిలా ఉంటే, పూర్తిగా వినోదాత్మకంగా సాగే ఈ న్యూ-ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రంలో ఊహించని మలుపులు, వైవిధ్యమైన పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని చిత్ర బృందం చెబుతోంది. ప్రశాంతమైన మేఘాలయ ప్రకృతి దృశ్యాల నడుమ సాగే ఈ కథ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని సీఎం సంగ్మా ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రకృతి అందాలను, స్థానిక సంస్కృతిని, అక్కడి ఆతిథ్యాన్ని నేరుగా అనుభవించడానికి ప్రేక్షకులను థియేటర్లకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. చిత్రాలయం స్టూడియోస్ నిర్మాత వేణు దోనేపూడి సీఎం సంగ్మా ప్రశంసలపై స్పందిస్తూ తమ కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మాత వేణు దోనేపూడి కామెంట్స్

"మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా గారి ఆదరణ, ప్రోత్సాహం మా బృందానికి కొండంత బలాన్ని ఇచ్చాయి. అక్కడి ప్రజలు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి, షూటింగ్ పూర్తయ్యే వరకు పూర్తి సహకారం అందించారు. మేఘాలయ ప్రకృతి అందాలు 'బా బా బ్లాక్ షీప్' సినిమాకు ప్రాణవాయువుగా మారాయి. భవిష్యత్తులో కూడా ఆ ప్రాంతంలో మరిన్ని సినిమాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నాం" అని నిర్మాత వేణు దోనేపూడి వెల్లడించారు.

దోనేపూడి చక్రపాణి సమర్పణలో రూపొందిన ఈ క్రైమ్ కామెడీ సినిమా బా బా బ్లాక్ షీప్ అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks