OTT Thriller: భార్య మర్డర్ కేస్.. 90 నిమిషాల టైమ్ ఇచ్చే ఏఐ జడ్జీ.. ఇవాళ ఓటీటీలోకి వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్
OTT Thriller: డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఓ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. ఏఐ జడ్జీ ఇచ్చిన 90 నిమిషాల డెడ్ లైన్ చుట్టూ సాగే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఇది.
ఓటీటీలో థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ వేరు. ఇక ఇందులోనూ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లు అంటే ఆడియన్స్ తెగ చూసేస్తారు. ఇప్పుడు అలాంటి ఓ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘మెర్సీ’ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (మార్చి 22) నుంచి ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.

మెర్సీ ఓటీటీ
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘మెర్సీ’ సినిమా ఇవాళ ఓటీటీ డెబ్యూ చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్లర్ లవర్స్ కు మెర్సీ మూవీ మంచి ఆప్షన్.
తెలుగులోనూ
మెర్సీ మూవీ తెలుగులోనూ డిజిటల్ డెబ్యూ చేసింది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మెర్సీ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు.
థియేటర్లో ఇలా
మెర్సీ సినిమా జనవరి 23, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు రెండు నెలలకు ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రానికి బెక్మంబెటోవ్ డైరెక్టర్. ఈ మెర్సీ మూవీని అట్లాస్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఇందులో క్రిస్ ప్రాట్, రెబెకా ఫెర్గూసన్, రీస్, అనబెల్ వాలిస్, క్రిస్ తదితరులు నటించారు.
మెర్సీ స్టోరీ
మెర్సీ మూవీని ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కించారు. ఏఐ టెక్నాలజీ ఎంతలా ఇంపాక్ట్ చూపుతుంది? ఆ ఏఐ జడ్జీ ఓ కేసులో తీర్పు ఇవ్వాల్సి వస్తే ఎలా ఉంటుంది? అనే కథ చుట్టూ మెర్సీ మూవీ సాగుతుంది.
ఫ్యూచర్ లో టెక్నాలజీ ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ మూవీ భవిష్యత్ నేపథ్యంలో సాగుతుంది. మెర్సీ క్యాపిటల్ కోర్టులో ఏఐ జడ్జీ (న్యాయమూర్తి) ఉంటుంది. కేసులను విచారించి శిక్షలు ఖరారు చేస్తుంది.
భార్య హత్య కేసు
లాస్ ఏంజిలెస్ పోలీస్ డిపార్ట్మెంట్ లో క్రిస్టోఫర్ క్రిస్ రావెన్ (క్రిస్) డిటెక్టివ్ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. అయితే తన భార్య నికోల్ మర్డర్ కేసులో అతను ఇరుక్కుంటాడు. ఆ హత్య అతను చేయలేదని నిరూపించుకునేందుకు ఏఐ జడ్జీ క్రిస్ కు 90 నిమిషాల టైమ్ మాత్రమే ఇస్తుంది.
మరి ఆ 90 నిమిషాల్లోపు క్రిస్ తాను ఇన్నోసెంట్ అని నిరూపించుకున్నాడా? అసలు క్రిస్ భార్యను ఎవరు చంపారు? ఏఐ జడ్జీ ఎలాంటి తీర్పు ఇచ్చిందన్నది తెలియాలంటే మెర్సీ మూవీ చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


