Michael Movie: మైఖేల్ జాక్సన్ బయోపిక్‌కు షాక్.. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో ఆ కేటగిరీలోకి నో ఎంట్రీ.. ఇక కష్టమే..

Michael Movie: 'పాప్ కింగ్' మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా రూపొందిన 'మైఖేల్' (Michael) చిత్రానికి అంతర్జాతీయ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్స్ (Golden Globes) అవార్డుల కమిటీ ఊహించని షాక్ ఇచ్చింది. 'మ్యూజికల్ ఆర్ కామెడీ' కేటగిరీ రిక్వెస్ట్‌ను తిరస్కరిస్తూ, ఈ సినిమాను డ్రామా రేసులోకి కమిటీ మార్చింది.

Published on: Oct 21, 2026, 16:38:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Michael Movie: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను తన సంగీతం, డ్యాన్స్ తో ఊపేసిన 'కింగ్ ఆఫ్ పాప్' మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న మూవీ 'మైఖేల్' (Michael). బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన ఈ మూవీకి 2027 గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల వేదికపై ఒక కీలకమైన సాంకేతిక ఎదురుదెబ్బ తగిలింది.

Michael Movie: మైఖేల్ జాక్సన్ బయోపిక్‌కు షాక్.. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో ఆ కేటగిరీలోకి నో ఎంట్రీ.. ఇక కష్టమే..
Michael Movie: మైఖేల్ జాక్సన్ బయోపిక్‌కు షాక్.. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో ఆ కేటగిరీలోకి నో ఎంట్రీ.. ఇక కష్టమే..

ఈ మైఖేల్ మూవీని 'మ్యూజికల్ ఆర్ కామెడీ' (Musical or Comedy) కేటగిరీలో నామినేషన్ కోసం సమర్పించగా, గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కమిటీ ఆ ప్రతిపాదన అభ్యర్థనను తోసిపుచ్చినట్లు ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థ 'వెరైటీ' కథనం పేర్కొంది. దీనివల్ల ఈ మూవీ క్రిస్టోఫర్ నోలన్ మూవీ 'ది ఒడిస్సీ' (The Odyssey)తో సహా పలు దిగ్గజ సినిమాలతో తీవ్ర పోటీని ఎదుర్కొనాల్సి రానుంది.

మ్యూజికల్ కేటగిరీ కాకపోతే ఏమవుతుంది?

గోల్డెన్ గ్లోబ్స్ కమిటీ నిర్ణయంతో ఈ చిత్రం ఇప్పుడు నేరుగా 'డ్రామా రేస్' (Drama Race) విభాగంలోకి వెళ్లింది. దీనివల్ల అవార్డు పోటీ మరింత క్లిష్టంగా మారనుంది. సాధారణంగా డ్రామా కేటగిరీలో కేవలం 6 నామినేషన్ స్థానాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

దీనితో హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' (The Odyssey), లాస్ జావిస్ రూపొందించిన 'లా బోలా నెగ్రా' వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో మైఖేల్ బయోపిక్ పోటీ పడాల్సి ఉంటుంది. అయితే సహాయ నటుల కేటగిరీలలో (Supporting Acting Categories) ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదు. మైఖేల్ తల్లిదండ్రులైన జో, క్యాథరిన్ జాక్సన్ పాత్రలు పోషించిన కోల్మన్ డోమింగో, నియా లాంగ్‌లు తమ విభాగాల్లో ఎప్పటిలాగే పోటీపడవచ్చు.

లయన్స్‌గేట్ నిర్మాణ సంస్థకు ఈ నిర్ణయాన్ని సవాలు చేసేందుకు అక్టోబర్ 31 వరకు సమయం ఉంది. గోల్డెన్ గ్లోబ్స్ నిబంధనల ప్రకారం.. "కథానాయకుల సంభాషణలతో పాటు కథను ముందుకు తీసుకెళ్లడానికి పాటలను ఉపయోగించే చిత్రాలను మ్యూజికల్"గా పరిగణిస్తారు.

సీక్వెల్ కూడా లైన్లోనే..

ఒకవైపు అవార్డుల విభాగంలో చర్చలు నడుస్తుండగానే, ఈ సినిమా సీక్వెల్ ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మైఖేల్ జాక్సన్ లాయర్, మేనేజర్ జాన్ బ్రాంకా పాత్రలో నటించిన ప్రముఖ నటుడు మైల్స్ టెల్లర్ (Miles Teller) ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ ఉందనే విషయాన్ని ధృవీకరించారు.

పాప్ కింగ్ జీవితంలోని వివాదాస్పద అంశాలు, చిన్నారుల వేధింపుల ఆరోపణలను రెండవ భాగంలో చూపిస్తారా అన్న ప్రశ్నకు జాఫర్ జాక్సన్ స్పందిస్తూ.. "రెండో భాగం గురించి నేను ఖచ్చితంగా ఏమీ చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు. నటుడిగా నా పని ఉత్తమమైన నటనను అందించడమే. కానీ మైఖేల్ గురించి తెలుసుకోవాలంటే అది ఆయన మ్యూజిక్, సాహిత్యం, ఆయన చేసిన సామాజిక సేవలలోనే ఉంది" అని వివరించారు.

మైఖేల్ జియోహాట్‌స్టార్ ఓటీటీలో..

ఆంటోనీ ఫుక్వా (Antoine Fuqua) దర్శకత్వంలో, జాన్ లోగాన్ రచనలో తెరకెక్కిన ఈ మైఖేల్ మూవీ.. 1960ల కాలంలో 'జాక్సన్ 5' బ్యాండ్ ప్రారంభం నుంచి 1980ల నాటి బ్లాక్‌బస్టర్ 'బ్యాడ్' టూర్ వరకు మైఖేల్ ప్రయాణాన్ని ఆవిష్కరించింది. నిజ జీవితంలో మైఖేల్ జాక్సన్ మేనల్లుడైన జాఫర్ జాక్సన్ (Jaafar Jackson) ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు.

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ ఏప్రిల్ 2026లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి గోల్డెన్ గ్లోబ్స్ వేదికపై డ్రామా విభాగంలో ఈ సినిమా ఏమేరకు పురస్కారాలను కొల్లగొడుతుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More