Phule Movie: మహాత్మా జ్యోతిబా పూలే జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘ఫూలే’ (PHULE - 2025) సినిమా నేటి సమాజానికి ఆదర్శప్రాయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలుగులో ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
మంత్రిని కలిసిన హీరో

గురువారం (నవంబర్ 26) మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ‘ఫూలే’ సినిమా హీరో ప్రతీక్ గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే జీవిత చరిత్రను, ఆయన సామాజిక ఉద్యమాలను వెండితెరపై ఆవిష్కరించిన సినిమా బృందాన్ని మంత్రి అభినందించారు. హీరో ప్రతీక్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.
అంటరానితనానికి వ్యతిరేకంగా
మహాత్మా జ్యోతిబా పూలే కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని, మహిళల విద్య కోసం విశేష కృషి చేశారని మంత్రి గుర్తుచేశారు. బాలికల విద్య కోసం పాఠశాలలు ప్రారంభించడం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమించడం, 1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించడం వంటి ఆయన చారిత్రాత్మక కార్యాచరణను ఈ సినిమాలో చూపించారని పేర్కొన్నారు.
జీవితం స్ఫూర్తిదాయకం
సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీల అభ్యున్నతి, సామాజిక సమానత్వం, విద్యా సాధికారతకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాల స్ఫూర్తితో సామాజిక న్యాయం, బీసీల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
మూవీ చూసిన సీఎం
{{/usCountry}}తెలంగాణ ప్రభుత్వం కూడా మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాల స్ఫూర్తితో సామాజిక న్యాయం, బీసీల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
మూవీ చూసిన సీఎం
{{/usCountry}}ఇప్పటికే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ‘ఫూలే’ చిత్రాణ్ని వీక్షించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సినిమా బృందాన్ని వాళ్లు ప్రత్యేకంగా అభినందించారని పొన్నం వెల్లడించారు. ఈ మూవీ తెలుగులో మంచిగా ఆడాలని మంత్రి ఆకాంక్షించారు.
ఫూలే గురించి
మహాత్మ జ్యోతి రావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే కథతో ‘ఫూలే’ మూవీని అనంత్ మహాదేవన్ తెరకెక్కించారు. ఇందులో జ్యోతిరావు ఫూలేగా ప్రతీక్ గాంధీ, సావిత్రిబాయిగా పత్రలేఖ నటించారు. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 25న హిందీలో రిలీజైంది. మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులోకి ఈ మూవీని డబ్ చేస్తున్నారు. శుక్రవారం (నవంబర్ 27) ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHOR
చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.