...
...
Next Story

ఓటీటీలోకి ఇవాళ ఒకరోజు ముందే వచ్చిన నయా మలయాళ క్రైమ్ థ్రిల్లర్- తెలుగులో స్ట్రీమింగ్- దృశ్యం రేంజ్‌లో ట్విస్టులు?

ఓటీటీలోకి ఇవాళ ఒకరోజు ముందే డిజిటల్ స్ట్రీమింగ్‌కు నయా మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా మిరాజ్ వచ్చేసింది. దృశ్యం సినిమాల డైరెక్టర్ జీతూ జోసేఫ్ దర్శకత్వం వహించిన మిరాజ్ తెలుగుతో కలిపి ఏడు భాషల్లో ఓటీటీ రిలీజ్ అయింది. అపర్ణ బాలమురళి నటించిన మిరాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 19, 2025, 12:42:14 IST
Advertisement

మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అందులోనూ మలయాళ థ్రిల్లర్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే మాలీవుడ్ నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలపై స్పెషల్ బజ్, ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. వాటిని చూసేందుకు ఓటీటీ ఆడియెన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు.

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

ఓటీటీలోకి ఇవాళ ఒకరోజు ముందే వచ్చిన నయా మలయాళ క్రైమ్ థ్రిల్లర్- తెలుగులో స్ట్రీమింగ్- దృశ్యం రేంజ్‌లో ట్విస్టులు?
ఓటీటీలోకి ఇవాళ ఒకరోజు ముందే వచ్చిన నయా మలయాళ క్రైమ్ థ్రిల్లర్- తెలుగులో స్ట్రీమింగ్- దృశ్యం రేంజ్‌లో ట్విస్టులు?

అలాంటి ప్రేక్షకుల కోసం అన్నట్లుగానే మలయాళం నుంచి ఎప్పుడు ఏదో ఒక థ్రిల్లర్ జోనర్ సినిమా వస్తూనే ఉంటుంది. అలా, రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమానే మిరాజ్. ఈ సినిమాకు థ్రిల్లర్ మూవీస్‌కు పెట్టింది పేరు అయిన జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు.

ఇతర భాషల్లో రీమేక్ చేసి

జీతూ జోసెఫ్ ఇదివరకు దృశ్యం, దృశ్యం 2 వంటి బ్లాక్ బస్టర్ థ్రిల్లర్స్ అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలను సౌత్‌లోని ఇతర భాషలతోపాటు నార్త్‌లో కూడా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. ఇక మిరాజ్ సినిమాలో అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సంపత్ రాజ్, హన్నా రెజీ కోషి, దీపక్ పరంబోల్, శరవణన్ ముఖ్య పాత్రలు పోషించారు.

రైలు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి చుట్టూ

ఒక యాక్సిడెంట్ చుట్టూ అల్లుకున్న కథగా మిరాజ్ తెరకెక్కింది. రైలు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి చుట్టు, అతని మరణానికి అసలు కారణం వంటి అంశాలతో థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ సీన్లతో మిరాజ్ తెరకెక్కింది. ఈ సినిమాకు దృశ్యం డైరెక్టర్ కావడంతో మిరాజ్‌లో కూడా ఆ రేంజ్ ట్విస్టులు, సీన్స్ ఉంటాయని అభిమానులు ఊహిస్తున్నారు.

మిరాజ్ ఓటీటీ స్ట్రీమింగ్

తెలుగుతో కలిపి మలయాళం, హిందీ, తమిళం, కన్నడ, మరాఠి, బెంగాలీ వంటి ఏడు భాషల్లో మిరాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు డిజిటల్ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ ప్రకటించింది. ఇదిలా ఉంటే, రెండున్నర గంటల రన్ టైమ్ ఉన్న మిరాజ్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.1 రేటింగ్ వచ్చింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe